- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా డబ్బులు తీసుకొని నన్ను దారుణంగా మోసం చేశారంటూ అనసూయ షాకింగ్ పోస్ట్.. అయ్యో పాపం అంటున్న నెటిజన్లు
బుల్లితెర యాంకర్ అనసూయ(Anasuya Bharadwaj ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ షో ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

దిశ, సినిమా: బుల్లితెర యాంకర్ అనసూయ(Anasuya Bharadwaj ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ షో ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అంతేకాకుండా పలు షోలు చేసిన అనసూయ ఫుల్ క్రేజ్ రాబట్టుకుంది. ఈక్రమంలోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆమె స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి తన ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘రంగస్థలం’(Rangasthalam) మూవీలో రంగమ్మత్తగా కనిపించడంతో అమ్మడు రేంజ్ మారిపోయింది. అలాగే అల్లు అర్జున్(Allu Arjun) ‘పుష్ప-2’(pushpa-2) లోనూ విలన్‌కు భార్యగా నటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తెలుగు, తమిళ, భాషల్లో వరుస చిత్రాల్లో నటిస్తు్న్న అనసూయ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తన గ్లామరస్ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట మంట పెట్టేస్తోంది.
అలాగే తనను ట్రోల్ చేస్తున్న వారికి స్ట్రాంగ్ కౌంటర్లు వేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. ప్రస్తుతం అనసూయ రెండు తమిళ ప్రాజెక్ట్స్ చేస్తోంది. అలాగే రియాలిటీ షోల్లోనూ జడ్జిగా వ్యవహిస్తూ చేతినిండా సంపాదిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, అనసూయ ఆన్‌లైన్ మోసానికి గురైంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ‘‘నేను @truffle-indiaలో కొన్ని రోజుల క్రితం పలు బట్టలు ఆర్డర్ చేశాను. ఆ దుస్తులు డెలివరీ చేయకుండా మీరు నా డబ్బులు దోచుకున్నారు. డబ్బును రీఫండ్ కూడా చేయకుండా స్పందించడం మానేశారు. సొంతంగా దుస్తులు అమ్ముతున్నామని చెప్పి అప్పనంగా డబ్బులు కొట్టేస్తూ జనాలను మోసం చేస్తున్నారు. ఇలాంటి మోసాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే నేను ఈ పోస్ట్ పెడుతున్నాను’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా క్లాతింగ్ వెబ్‌సైట్ నుంచి ఎలాంటి స్పందన లేదని మండిపడింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు అయ్యో పాపం అని కామెంట్లు చేస్తున్నారు.






