ర‌జినీకాంత్ సినిమాలో అన‌సూయ‌కు ఛాన్స్‌...క్రేజీ న్యూస్ వైర‌ల్ !

by velandi.Saikiran |

ర‌జినీకాంత్ తో అనసూయ ఫ్యామిలీ ఫోటోలు దిగింది. ఈ ఫోటోలు వైర‌ల్ గా మారాయి.

ర‌జినీకాంత్ సినిమాలో అన‌సూయ‌కు ఛాన్స్‌...క్రేజీ న్యూస్ వైర‌ల్ !
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది యాంకర్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది మాత్రమే పాపులర్ అవుతూ. అలాంటి వారిలో యాంకర్ అనసూయ ఒకరు. జబర్దస్త్ షో లో యాంకర్ గా రాణించి.. సినిమాల్లోకి వచ్చింది అనసూయ. ఈ క్రమంలోనే టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంది. పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమాల్లో కూడా నటించి అందరిని మెప్పించింది. రంగమ్మత్తగా కూడా పేరు తెచ్చుకుంది. అయితే అలాంటి అనసూయ తాజాగా సమ్మర్ వెకేషన్ కు వెళ్ళినట్లు తెలుస్తోంది.

తన ఫ్యామిలీతో కలిసి వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఫోటోలు దిగారు అనసూయ. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకొని.. మై ఫేవరెట్ హీరో అంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. రజినీకాంత్ నెక్స్ట్ సినిమాలో అనసూయకు పాత్ర దొరికినట్లు ఉందని.. అందుకే ఆయనతో ఫోటోలు దిగి హింట్ ఇచ్చినట్లు కొంతమంది అంటున్నారు. అనసూయకు అంత సీన్ లేదని, అనుకోకుండా రజినీకాంత్ ను కలిసి ఫోటోలు దిగినట్లు మరి కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. దీంతో అన‌సూయ చేసిన పోస్ట్ హాట్ టాపిక్ అయింది.

Next Story