Anasuya Bharadwaj : ‘పుష్ప2’ షూటింగ్ స్పాట్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనసూయ.. న్యూ లుక్‌తో అదుర్స్

by Kema Shiva Kumar |   (  Updated:2023-06-26 18:40:24  IST  )

'పుష్ప ది రైజ్' లో నెగటివ్ రోల్ లో అద్భుత నటనతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది ప్రముఖ యాంకర్ అనసూయ.

Anasuya Bharadwaj : ‘పుష్ప2’ షూటింగ్ స్పాట్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనసూయ.. న్యూ లుక్‌తో అదుర్స్
X

దిశ, వెబ్ డెస్క్ : 'పుష్ప: ది రైజ్' లో నెగటివ్ రోల్ లో తన అద్భుత నటనతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది ప్రముఖ యాంకర్ అనసూయ. మంగళం శ్రీను భార్యగా టెర్రిఫిక్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టింది. ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ ‘పుష్ప: ది రూల్’ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో అనసూయ రోల్ మరింత పవర్‌పుల్‌గా ఉండనుందని సమాచారం.

నిజానికి పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ ఎప్పటి నుంచో జరుగుతున్నా.. రీసెంట్ షెడ్యూల్‌లో మూవీ టీంతో అనసూయ జాయిన్ అయింది. తాజాగా మేకప్ రూంలో దాక్షాయణి పాత్రకు రెడీ అవుతూ తీసుకున్న మిర్రర్ సెల్ఫీ పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు దీనికి ‘పుష్ప: ది రూల్’ అనే క్యాప్షన్‌తో ఫైర్ ఎమోజీస్ యాడ్ చేసింది.

అయితే అనసూయ ఈ మధ్యే రిలీజైన ‘విమానం’ సినిమాలో వేశ్య పాత్ర పోషించింది. ఈ పాత్రకు గాను మంచి మార్కులే కొట్టేసింది. అంతేకాదు ఈ సినిమా కంటే ముందు కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ‘రంగమార్తాండ’ చిత్రంలో పోషించిన పాత్రకు కూడా తన అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభించాయి.

Read More..

ఇండియాలోనే ‘హాటెస్ట్ నైట్ గర్ల్’.. ఆమె ఒక్క నైట్‌ ధర రూ.40 లక్షలు


https://www.instagram.com/p/Ct9IFMjRqiA/?utm_source=ig_embed&ig_rid=0b452801-f238-4b49-a1c8-936de3833da0

Next Story