ఒక్క పోస్ట్‌తో హేటర్స్‌ను సైతం తనవైపు తిప్పుకున్న Anasuya..

by Disha Web Desk 7 |
ఒక్క పోస్ట్‌తో హేటర్స్‌ను సైతం తనవైపు తిప్పుకున్న Anasuya..
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో వివాదాలకు కేరాఫ్‌గా నిలిచే బ్యూటీ అనసూయ. యాంకర్‌గా బుల్లితెరపై అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక సమయం దొరికిన ప్రతీసారి నెట్టింట తన అందాలతో, బోల్డ్ లుక్‌తో కుర్రాకారుకి నిద్ర లేకుండా చేస్తుంది. ఈ క్రమంలోనే ఒక్కోసారి తీవ్రమైన విమర్శలు సైతం ఎదుర్కొంటుంది. కానీ, తనపై వచ్చే ట్రోల్స్ పట్టించుకోని ఈ అమ్మడు.. నెటిజన్లను రెచ్చగొట్టేలా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు పెట్టిన పోస్ట్.. తన హేటర్స్‌ను రెచ్చగొట్టేలా ఉంది. ఈ మేరకు ‘‘ద్వేషించే వారందరికీ ఒక సందేశం. నేను చేసే పని మీకు నచ్చకపోవచ్చు. కానీ నేను చేసేదంతా మీరు చూస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ మీరు నా అభిమానులే’’ అంటూ పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు.



Next Story

Most Viewed