షాకింగ్ నిర్ణయం తీసుకున్న అనసూయ.. ఇకపై వాటి జోలికి పోనంటూ సంచలన పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-01 05:45:42  IST  )

నటుడు శివాజీ (Shivaji)హీరోయిన్ల బాడీ పార్ట్స్ దుస్తులపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మొదలైన వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది.

షాకింగ్ నిర్ణయం తీసుకున్న అనసూయ.. ఇకపై వాటి జోలికి పోనంటూ సంచలన పోస్ట్
X

దిశ, సినిమా: నటుడు శివాజీ(Shivaji) హీరోయిన్ల బాడీ పార్ట్స్ దుస్తులపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మొదలైన వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. శివాజీ వ్యాఖ్యలను తప్పుబట్టిన అనసూయ(Anasuya)పై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం, ఆమె వ్యక్తిగత ఫోటోలను టార్గెట్ చేయడంతో ఈ ఇష్యూ పెద్ద రాద్దాంతానికి దారితీసింది. అయితే, ఈ కొత్త ఏడాది సందర్భంగా అనసూయ ఒక షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో షాకింగ్ పోస్ట్ పెట్టారు. ఇకపై అర్థంలేని విషయాలకు, అవసరం లేని డ్రామాల జోలికి అస్సలు పోనని ఆమె స్పష్టం చేశారు. ఈ ఏడాది తన జీవితంలో శాంతి ఉండాలని కోరుకుంటూ, తన ఆనందాన్ని ఇతరుల కోసం సమర్థించుకోవాల్సిన అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తన కొత్త జీవనశైలి గురించి వివరిస్తూ.. ఇష్టమైనది తినడం, నచ్చిన చోటుకు ప్రయాణించడం మరియు భయం లేకుండా తన భావాలను చెప్పడమే తన ప్రస్తుత లక్ష్యమని అనసూయ పేర్కొన్నారు. ఇకపై నన్ను నేనే తగ్గించుకోను, నా వెలుగును దాచకుండా మరింత ప్రకాశిస్తానుఅని రాసుకొచ్చింది. ఈ క్రమంలోనే తన భర్తతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో బికినీ ధరించి ఉన్న బోల్డ్ ఫోటోలను షేర్ చేసి విమర్శకుల నోళ్లు మూయించే ప్రయత్నం చేశారు. ఈ ఫోటోలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆమెను విమర్శిస్తుండగా, మరికొందరు మాత్రం ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తానికి అనసూయ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story