దసరా ‘స్పెషల్’ వీడియో షేర్ చేసిన అనసూయ.. ‘బ్యాక్ పేన్ వస్తుందా పాపం’ అంటూ ట్రోల్స్

by Disha Web Desk 7 |
దసరా ‘స్పెషల్’ వీడియో షేర్ చేసిన అనసూయ.. ‘బ్యాక్ పేన్ వస్తుందా పాపం’ అంటూ ట్రోల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అనసూయ గురించి ఎంత చెప్పిన తక్కువే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా దూసుకుపోతోంది. అంతే కాకుండా.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అప్‌డేట్స్ మొత్తం అభిమానులతో పంచుకుంటుంది. వేసుకునే డ్రస్సులకు, పోస్టులకు ఎన్ని ట్రోల్స్ వచ్చిన ఏ మాత్రం పట్టించుకోని యాంకర్.. తన అందాలతో నెట్టింట హల్ చల్ చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే మరోసారి వర్కౌట్స్ అందాలు పంచుకుంది ఈ బ్యూటీ.

అంతే కాకుండా.. ఆ పోస్ట్‌కు అదిరిపోయే క్యాప్షన్ ఇస్తూ ‘‘ఈ దసరా.. చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకోండి.. సోమరితనంపై చేతిపనుల విజయాన్ని జరుపుకోండి.. సందేహ భయంపై దృష్టి, నిబద్ధత, అంకితభావాల విజయాన్ని జరుపుకోండి’’ అని చెబుతూనే ‘‘ప్రజలు ఏమి చెప్పినా .. “నీకిప్పుడు అవసరమా ఆంటీ” .. “35 దాటిన ఎందుకు ఇవన్నీ”.. “ఇంట్లో పిల్లల్ని చూడొచ్చు కదా” .. వగైరా.. వీళ్లంతా మన స్వాతంత్ర్యానికి భయపడతారు.. మనం మనమే నేర్చుకుంటే మన మీదే దృష్టి పెడతారేమో అని భయపడ్డతారు. క్షేమం.. మాకు వారి అవసరం లేదు.. మీపై మీరు దృష్టి పెట్టండి.. మీరు ఆరోగ్యంగా ఉండటానికి అర్హులు.. మీరు సంతోషంగా ఉండటానికి అర్హులు.. మీరు కోరుకునే ప్రతిదానికీ మీరు విలువైన వారు.. తనలో పరివర్తనను మేల్కొల్పుకునే ప్రతి స్త్రీ కాళి.. దసరా శుభాకాంక్షలు’’ అంటూ చెప్పుకొచ్చింది. అయినప్పటికీ తనపై ట్రోల్స్ ఆగలేదు. ఈ వయసులో నీకు అవసరమా అంటూ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.



Next Story

Most Viewed