సంచలన నిర్ణయం తీసుకొన్న అనసూయ.. గుడ్ బై.. ఇకపై కలవనంతే?

by Anjali |
సంచలన నిర్ణయం తీసుకొన్న అనసూయ.. గుడ్ బై.. ఇకపై కలవనంతే?
X

దిశ, వెబ్‌డెస్క్: హాట్ బ్యూటీ అనసూయ గురించి సుపరిచితమే. ఈ భామ యాంకర్ స్టేజ్ నుంచి ప్రస్తుతం అగ్ర హీరోల సినిమాల్లో నటించే స్థాయికి వెళ్లింది. కాగా అనసూయకు సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉందని చెప్పుకొవచ్చు. ఎందుకంటే తన హాట్ ఫోటో షూట్స్, సినిమా అప్డేట్స్, టూర్స్, ఫ్యామిలీ పార్టీలు, ఈవెంట్స్ ఇలా ఒకటేంటి ప్రతి ఒక్కటి తన ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. ఈమె ఏ పోస్ట్ పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతుంది. లక్షల్లో లైకులు వస్తాయి. కానీ కొన్ని సార్లు అనసూయను విమర్శించే వాళ్లు నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు. మరీ ఈ రంగమత్త విని సైలెంట్‌గా ఊరుకుంటుందా? ఎప్పటికప్పుడు ఇచ్చిపడేస్తుంటుంది.

అయితే అనసూయ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ చూస్తే ఎవరో ఆమెను బాగా హర్ట్ చేసినట్లు, తన మర్యాదకు భంగం కలిగించినట్లు తెలుస్తోంది. దీంతో ఇకపై వాళ్ళను కలిసేది లేదంటుంది. ‘‘ఎడబాటే అగౌరవానికి నా సమాధానం. ఇక నేను స్పందించను, ఎవరితో వాదనకు దిగను, నటించను, సింపుల్‌గా కలవడం మానేస్తా అంతే’’ అంటూ రాసుకొచ్చింది. అనసూయ ఎవరినో ఉద్దేశించి ఈ కామెంట్స్ చేసింది. వారేవరబ్బా? ఇలా సస్పెన్స్‌లో పెట్టిందేంటి? వామ్మో అనసూయ నిర్ణయం తీసుకుందంటే అది చాలా కఠినంగా ఉంటుంది. మరీ ఈ భామ ఎవరికి గుడ్ బై చెప్పి ఉంటుంది అంటూ నెటిజన్లు తెగ క్యూరియాసిటితో కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అనసూయ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story