మరపురాని ప్రయాణం ముగిసింది.. ప్రేమలో పడటం కోసం వేచి ఉండలేనంటూ అనన్య ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Pandey), కార్తీక్ ఆర్యన్(Karthik Aryan) కాంబినేషన్‌లో రాబోతున్న మూవీ ‘తూ మేరి మే తేరా మే తేరా తూమేరీ’(TuMeriMainTeraMainTeraTuMeri ).

మరపురాని ప్రయాణం ముగిసింది.. ప్రేమలో పడటం కోసం వేచి ఉండలేనంటూ అనన్య ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Pandey), కార్తీక్ ఆర్యన్(Karthik Aryan) కాంబినేషన్‌లో రాబోతున్న మూవీ ‘తు మేరి మైన్ తేరా మైన్ తేరా తుమేరీ’(TuMeriMainTeraMainTeraTuMeri ). సమీర్ విద్వాన్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ధర్మా ప్రొడక్షన్ బ్యానర్‌పై కరణ్ జోహీర్, అదార్ పూనవల్లా, షరీన్, భూమిక తివారీ, అపూర్వ మెహతా, నిర్మిస్తున్నారు. ఇందులో నీనా గుప్తా కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 13న థియేటర్స్‌లోకి రాబోతుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, అనన్య పాండే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘తు మేరి మైన్ తేరా మైన్ తేరా తుమేరీ’ షూటింగ్ పూర్తి అయినట్లు వెల్లడించింది. ‘‘TuMeriMainTeraMainTeraTuMeri మరపురాని, సరదాగా నిండిన, సూపర్-ఫాస్ట్ రోలర్-కోస్టర్ రైడ్ 57 రోజుల ప్రయాణం ముగిసింది. మా టీమ్ లేకుండా ఈ ప్రయాణం సాధ్యం అయ్యేది కాదు. నాకు ఇష్టమైన షరీన్ మంత్రి, అరోరా కిషోర్ ఎనర్జీలు ముఖ్యమైనవి. అందుకే కరణ్ జోహర్, అపూర్వ మెహతా, అదార్ పూర్ణావాలా ఈ ప్రాజెక్ట్‌ను మరింత ప్రత్యేకంగా చేశారు. అద్భుతమైన కోస్టార్‌గా ఉన్నందుకు నా ప్రియమైన కార్తీక్ ఆర్యన్‌కు ధన్యవాదాలు.

TMMTలో మీరు చేసిన పాత్రను మరెవరూ చేయలేరు. మీతో కలిసి పనిచేయడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. పెద్ద తెరపై వారి మాయాజాలాన్ని చూడటానికి వేచి ఉండండి. కరణ్ శర్మకి ప్రత్యేక ధన్యవాదాలు. సినిమా విడుదలైన తర్వాత అతను అందరి కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంటాడని నేను అనుకుంటున్నాను. మన ప్రపంచాన్ని అవిశ్రాంతంగా సజీవంగా తీసుకువచ్చి, రాత్రి పగలు అని తేడా లేకుండా పని చేసి ప్రతి ఒక్కరికీ థాంక్స్. మీరందరూ నవ్వడానికి, ప్రేమలో పడటానికి సిద్దంగా ఉండండి. నేను వేచి ఉండలేను. థియేటర్లలో కలుద్దాం’’ అని రాసుకొచ్చింది. అలాగే సెట్ ఎంజాయ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది.

Next Story