- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మ్యూజికల్ లవ్ స్టోరీతో రాబోతున్న అనన్య పాండే.. విడుదల తేదీ ఫిక్స్
ప్రేమ కాస్త పిచ్చివాళ్లను చేస్తుంది.. మీకు తెలుసా? అనే క్యాప్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే, నటుడు లక్ష్య జంటగా నటిస్తున్న సరికొత్త మ్యూజికల్ లవ్ స్టోరీ ‘చాంద్ మేరా దిల్’. వివేక్ సోనీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. మే 22న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ మేకర్స్ ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ను వదిలారు. ఈ సినిమా పోస్టర్‌పై ఉన్న "ప్రేమ కాస్త పిచ్చివాళ్లను చేస్తుంది.. మీకు తెలుసా?" అనే క్యాప్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం మామూలు ప్రేమకథలా కాకుండా, ప్రేమలో ఉండే ఆ గాఢతను, ఆ పిచ్చిని ఇందులో చాలా లోతుగా చూపించబోతున్నారని ఈ క్యాప్షన్ ద్వారా అర్థమవుతోంది. అనన్య, లక్ష్య ఒకరి చేతులు ఒకరు పట్టుకుని, ఎంతో ఎమోషనల్‌గా దగ్గరగా కూర్చున్న తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఈ పోస్టర్‌లో మరో హైలైట్ ఏమిటంటే, ఆ జంట వెనుక ఉన్న బుద్ధ విగ్రహం. బుద్ధుని సాక్షిగా సాగే ఈ ప్రేమ ప్రయాణం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ అంటేనే మంచి సంగీతం, విజువల్స్‌కు కేరాఫ్ అడ్రస్. అదే స్థాయిలో ఈ మ్యూజికల్ లవ్ స్టోరీని మే 22న సమ్మర్ కానుకగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. అనన్య పాండే తన గ్లామర్‌తో, లక్ష్య తన నటనతో ఈ సినిమాలో మ్యాజిక్ చేయబోతున్నారని తెలుస్తోంది.






