హీరోల వయసుతో నాకు పనిలేదు.. అది చేయగలిగితే చాలు: Ananya panday

by samatah |   (  Updated:2023-08-03 11:53:28  IST  )

బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా తనకు మధ్య ఉన్న ఏజ్ గ్యాప్‌‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది నటి అనన్యపాండే. వీరిద్దరు ప్రధాన పాత్రల్లో నటించిన ‘డ్రీమ్ గర్ల్2’ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో

హీరోల వయసుతో నాకు పనిలేదు.. అది చేయగలిగితే చాలు: Ananya panday
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా తనకు మధ్య ఉన్న ఏజ్ గ్యాప్‌‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది నటి అనన్యపాండే. వీరిద్దరు ప్రధాన పాత్రల్లో నటించిన ‘డ్రీమ్ గర్ల్2’ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్న నటి.. తనకంటే వయసులో చాలా పెద్దవాడైన వ్యక్తి సరసన నటించాలని దర్శకుడు చెప్పినపుడు తనకేమి వింతగా అనిపించలేదని చెప్పింది. ‘ఆయుష్మాన్ ఖురానా, నాకు 14 ఏళ్ల వయస్సు అంతరం ఉంది. ఇండస్ట్రీలో ఈ వయసు వ్యత్యాసంపై ఎప్పటినుంచో అనేక రకాల చర్చ నడుస్తోందని తెలుసు. అయితే సినిమా చూస్తున్నప్పుడు ప్రజలు వయస్సును పట్టించుకోకూడదు. కేవలం నటీనటుల పనితీరును చూడాలని కోరుకుంటా. ఇక ఇది నేటి సమస్య అని నేను అనుకోవట్లేదు’ అంటూ తన అభిప్రాయాలు వెల్లడించింది. చివరగా ఈ సినిమా ద్వారా తాను ఆయుష్మాన్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని, అతన్ని లేడీ గెటప్‌లో ఫస్ట్ టైమ్ చూసి ఆశ్చర్యపోయానని చెప్పింది.

Next Story