- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముచ్చటగా మూడోసారి యంగ్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న అనన్య పాండే.. ఈసారైనా హిట్ వచ్చేనా?
బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘నాగిల్లా’లో హీరోయిన్‌గా అనన్య పాండేను ఎంపిక చేసినట్లు సమాచారం.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ అనన్య పాండే ప్రస్తుతం ఒక భారీ హిట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. వరుస సినిమాలు చేస్తున్నా, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను పలకరిస్తున్నా ఆమె కెరీర్‌లో ఒక బలమైన విజయం మాత్రం పడటం లేదు. అయినప్పటికీ అస్సలు నిరాశ చెందకుండా, ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా వరుస ఆఫర్లను అంగీకరిస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ‘చాంద్ మేరా దిల్’ షూటింగ్‌తో బిజీగా ఉన్న ఈ భామ, తాజాగా తన ఖాతాలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్టును వేసుకుంది. బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘నాగిల్లా’లో హీరోయిన్‌గా అనన్య పాండేను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటికే వీరిద్దరూ కలిసి రెండు చిత్రాల్లో నటించారు, కానీ ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. ఇప్పుడు మూడోసారి మళ్లీ కలిసి నటిస్తుండటంతో, ఈ జోడీ మీద ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన వస్తోంది. ఈసారైనా ఈ జోడీ హిట్ కొడుతుందా లేదా అనేది ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది.
ఈ సినిమా కేవలం రొమాంటిక్ డ్రామా మాత్రమే కాదు, ఇందులో ఫాంటసీ, యాక్షన్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. దీనికి మృగ్‌దీప్ సింగ్ లాంబా దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్, మహావీర్ జైన్ ఫిల్మ్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంగీతం విషయానికి వస్తే, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ చక్రవర్తి బాధ్యతలు చూసుకుంటున్నారు. సో, టీమ్ మొత్తం చాలా పవర్‌ఫుల్‌గా ఉంది కాబట్టి, ఈ సినిమాతో అనన్య తన సత్తా చాటాలని ఆశిస్తోంది. ఈ సినిమాను వాస్తవానికి వచ్చే ఏడాది నాగుల పంచమి పండుగ సీజన్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, షూటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతుండటంతో, ఐదు నెలల ముందే రిలీజ్ చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న వాలెంటైన్స్ డే గిఫ్ట్‌గా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఫాంటసీ ప్రపంచంలో కార్తీక్ ఆర్యన్ యాక్షన్, అనన్య గ్లామర్ తోడైతే కచ్చితంగా ఈ సినిమా యూత్‌ను బాగా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ఈసారైనా అనన్య పాండే తన బ్యాడ్ లక్‌ని పక్కన పెట్టి హిట్ కొడుతుందేమో చూడాలి.






