- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎక్స్‌ప్రెషన్ క్వీన్.. ప్రపోజ్ చేసినప్పుడు పడుకుంది: Ananya Panday పై ట్రోలింగ్
దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే దారుణమైన ట్రోలింగ్‌కు గురవుతోంది. ఇటీవల ఆమె నటించిన 'లైగర్' సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక చతికిలపడిన సంగతి తెలిసిందే..Latest Telugu News

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే దారుణమైన ట్రోలింగ్‌కు గురవుతోంది. ఇటీవల ఆమె నటించిన 'లైగర్' సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక చతికిలపడిన సంగతి తెలిసిందే. కాగా ఇందులో అనన్య-విజయ్‌ల మధ్య ఒక సన్నివేశానికి సంబంధించిన బిట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నటిని ఆడేసుకుంటున్నారు. విషయానికొస్తే.. చిత్రంలో అప్పటికే కోపంతో ఊగిపోతున్న లైగర్.. హీరోయిన్ ముందు 'ఐ లవ్ యు' అని గట్టిగా అరుస్తాడు.
దీంతో ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైన అనన్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయితే ఈ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ నెటిజన్లు మాత్రం ఎగతాళి చేస్తు జోకులు పేల్చుతున్నారు. 'ఈ సీన్‌తో ఆమెకు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ వచ్చినట్లే', 'ఎక్స్‌ప్రెషన్ క్వీన్ అనన్య పాండే', 'అతను ప్రపోజ్ చేసినప్పుడు ఆమె నిద్రపోతున్నట్లు అనిపిస్తుంది' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : మళ్ళీ రెమ్యూనరేషన్ పెంచిన సమంత.. ఈ సారి ఏకంగా..
Expression queen Ananya Pandey pic.twitter.com/YLOIUA4gzK
— M (@_ahania) August 25, 2022
- Tags
- Ananya Panday






