అనన్య నాగళ్ల సంచలన నిర్ణయం.. డబ్బుల కోసం ఇంతకు దిగజారాలా అంటూ నెటిజన్లు కామెంట్స్

by Mallepaka Hamsa |

అనన్య నాగళ్ల తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల కోసం ఒక కొత్త ఆఫర్‌ను ప్రకటించినట్లు తెలుస్తోంది.

అనన్య నాగళ్ల సంచలన నిర్ణయం.. డబ్బుల కోసం ఇంతకు దిగజారాలా అంటూ నెటిజన్లు కామెంట్స్
X

దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం పోటీ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలో కొందరు నటీమణులు తమ కెరీర్‌ను నిలబెట్టుకోవడానికి భిన్నమైన మార్గాలను ఎంచుకుంటున్నారు. వెండితెరపై అవకాశాలు తగ్గినప్పుడు చాలామంది హీరోయిన్లు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అభిమానులకు దగ్గరవుతున్నారు. అయితే, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో గ్లామర్ షో చేయడం కేవలం ఫాలోయింగ్ కోసమే కాకుండా, డబ్బుల వచ్చేలా కూడా మారిపోయింది. తాజాగా, టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో యాంకర్ విష్ణుప్రియ తన ఫోటోషూట్స్ సబ్‌స్క్రిప్షన్ పద్ధతి ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తన ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ చూడాలంటే డబ్బులు చెల్లించాలనే నిబంధన పెట్టి ఆమె భారీగా సంపాదించిందని, అదే సమయంలో కొన్ని చట్టపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కొందని టాక్. ఇప్పుడు అదే బాటలో ‘వకీల్ సాబ్’ ఫేమ్ అనన్య నాగళ్ల కూడా ప్రయాణిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అనన్య నాగళ్ల తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల కోసం ఒక కొత్త ఆఫర్‌ను ప్రకటించినట్లు తెలుస్తోంది.

తన ప్రైవేట్, ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను చూడాలనుకునే వారు నెలకు రూ. 390 చెల్లించి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలని ఆమె కోరినట్లు సమాచారం. ఈ ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాల్లోనే దాదాపు 600 మందికి పైగా అభిమానులు ఆమె పేజీని సబ్‌స్క్రైబ్ చేసుకున్నారని నెట్టింట ప్రచారం జరుగుతోంది. కేవలం గ్లామర్ ఫోటోల కోసమే ఇంతమంది డబ్బులు చెల్లించడానికి సిద్ధపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పద్ధతైన పాత్రలతో మెప్పించిన అనన్య, ఇప్పుడు ఇలాంటి బోల్డ్ మార్గాన్ని ఎంచుకోవడం ఏమిటని కొందరు విమర్శిస్తున్నారు. విష్ణుప్రియ విషయంలో తలెత్తిన వివాదాలను గుర్తు చేస్తూ, అనన్య కూడా అలాంటి ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందేమో అని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే డబ్బులకోసం ఇంతకు దిగజారాలా అని తిట్టిపోస్తున్నారు. అయితే, ఆమె అభిమానులు మాత్రం తమ అభిమాన నటిని సరికొత్త లుక్‌లో చూడబోతున్నామనే ఉత్సాహంలో ఉన్నారు. ఏది ఏమైనా, టాలీవుడ్ హీరోయిన్లలో మొదలైన ఈ ‘సబ్‌స్క్రిప్షన్ కల్చర్’ రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Next Story