- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అవతలి వ్యక్తి కోసం నన్ను నేను తగ్గించుకున్నా.. ఇకపై ఎవరి కోసం మారే ప్రసక్తి లేదంటూ అనన్య షాకింగ్ కామెంట్స్
గతంలో నేను రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు అవతలి వ్యక్తి నాకంటే ఎక్కువగా మెరవాలని కోరుకునేదాన్ని. ఇందుకోసం నన్ను నేను తక్కువ చేసుకునేదాన్ని.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే తన గత ప్రేమ ప్రయాణాలు, వాటి ద్వారా తను నేర్చుకున్న పాఠాల గురించి తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రిలేషన్‌షిప్‌లో ఉండగా తనను తాను ఎలా తగ్గించుకునేదో వివరిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య మాట్లాడుతూ.. "గతంలో నేను రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు అవతలి వ్యక్తి నాకంటే ఎక్కువగా మెరవాలని కోరుకునేదాన్ని. ఇందుకోసం నన్ను నేను తక్కువ చేసుకునేదాన్ని. ఎదుటి వ్యక్తికి నచ్చేలా నన్ను నేను మార్చుకునేదాన్ని. ఒక వ్యక్తి కోసం మనల్ని మనం మార్చుకోకూడదని నేను ఆలస్యంగా తెలుసుకున్నాను" అని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాను ఒక్క క్షణం కూడా ఒంటరిగా ఉండలేకపోయేదాన్ని అని, కానీ ఇప్పుడు ఒంటరిగా ఉండటం, తన వ్యక్తిగత స్పేస్‌ను ఆస్వాదించడం నేర్చుకున్నానని ఆమె వెల్లడించారు.
కాాగా.. అనన్య పాండే గతంలో నటుడు ఇషాన్ ఖట్టర్‌తో డేటింగ్ చేశారు. ఆ తర్వాత ఆదిత్య రాయ్ కపూర్‌తో రెండేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే మే 2024లో వీరిద్దరూ విడిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం అనన్య, మోడల్ వాకర్ బ్లాంకోతో డేటింగ్‌లో ఉన్నట్లు బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో వాకర్‌ను తన 'పార్ట్నర్'గా అనన్య పరిచయం చేసినట్లు వార్తలు వచ్చాయి. అనన్య సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె లక్ష్య లల్వానీ సరసన ‘చాంద్ మేరా దిల్’ అనే రొమాంటిక్ డ్రామాలో నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 8, 2026న విడుదల కానుంది. వీటితో పాటు ఆమె నటించిన పాపులర్ వెబ్ సిరీస్ 'కాల్ మీ బే' సీజన్ 2 కూడా త్వరలో రాబోతోంది.






