- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అనగనగా ఒకరాజు’ సెలబ్రేషన్స్ షురూ.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డేట్ లాక్
రెండేళ్ల గ్యాప్ తర్వాత ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty)ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

దిశ, సినిమా: రెండేళ్ల గ్యాప్ తర్వాత ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty)ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘అనగనగా ఒకరాజు’ (AnaganagaOkaRaju ).ఈ సినిమాతో మారి దర్శకుడిగా పరిచయం కాబోతుండటం విశేషం ముఖ సినీ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్నారు. ఇందులో నవీన్ పొలిశెట్టి సరసన మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)రొమాన్స్ చేయనుంది. రావు రమేష్, చమ్మక్ చంద్ర, మహేష్ ఆచంట, గోపరాజు రమణ కీలక పాత్రలో కనిపించనున్నారు.
అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది.U/A సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా 2గంట 20 నిమిషాల నిడివితో రానుంది. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ డేట్ లాక్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ఈవెంట్‌తో రాజుగారి సెలబ్రేషన్స్ స్టార్ట్ కాబోతున్నాయని తెలిపారు. అయితే ఈ ఈవెంట్ వరంగల్ కాకతీయ జూనియర్ కాలేజీలో జనవరి 12న సాయంత్రం 5గంటలకు జరగబోతున్నట్లు అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పారు. అలాగే నవీన్ పొలిశెట్టి పోస్టర్‌ను షేర్ చేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఇందులో మంచకట్టు, కుర్తాలో గాగుల్స్ పెట్టుకుని సరదాగా.. సంక్రాంతి అల్లుడిగా ఊరంతా తిరుగుతున్నట్లు కనిపించాడు.






