- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అనగనగా ఒక రాజు’ నుంచి డబుల్ అప్డేట్స్.. పండుగకి స్టెప్పులు వేయడానికి రెడీగా ఉండాలంటూ పోస్ట్
‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో వచ్చి ప్రేక్షకులను అలరించిన నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty)ఏడాది గ్యాప్ తర్వాత ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju)సినిమాతో రాబోతున్నారు.

దిశ, సినిమా: ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో వచ్చి ప్రేక్షకులను అలరించిన నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty)ఏడాది గ్యాప్ తర్వాత ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju)సినిమాతో రాబోతున్నారు. మారి దర్శకత్వంలో పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇందులో నవీన్ పొలిశెట్టి సరసన మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhury)హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫ్యార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్స్‌లోకి రాబోతుంది. నవీన్–మీనాక్షి చౌదరి జంట తొలిసారి స్క్రీన్‌పై కనిపించనుండటం సినిమా మీద మరింత ఆసక్తిని పెంచుతోంది.
ఇప్పటికే వచ్చిన కంటెంట్ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను సృష్టించింది. నవ్వులు, భావోద్వేగాలు, ఫ్యామిలీ డ్రామా కలిపిన ఈ చిత్రం పండగ సీజన్‌లో వస్తే హిట్ అవుతుందని భావించి ఈ డేట్ ఫిక్స్ చేశారు. అయితే సంక్రాంతి బరిలో భారీ ప్రాజెక్ట్స్ రిలీజ్ అవుతుండటంతో పాటు మేకర్స్ కాస్త వెనక్కి తగ్గి విడుదలను వాయిదా వేసినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలోనే.. ‘అనగనగా ఒక రాజు’ మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వడంతో పాటు ఫస్ట్ సింగిల్ కూడా రాబోతున్నట్లు డబుల్ అప్డేట్స్‌ను ఇచ్చారు.
అంతేకాకుండా నవీన్ పొలిశెట్టి హెడ్ సెట్ పెట్టుకుని నిగ నిగ.. దగ దగ అని పాడుతున్న ఫన్నీ వీడియోను కూడా దీనికి జత చేశారు. ‘‘నవంబర్ 27న ‘అనగనగా ఒక రాజు’ నుంచి ‘భీమవరం బల్మా’ అని సాగే మొదటి పాట విడుదల కాబోతుంది. సంక్రాంతి పండుగకు డ్యాన్స్ స్టెప్పులు వేయడానికి రెడీగా ఉండండి. భీమవరం బల్మా బ్లాస్ట్ మ్యూజిక్‌తో మిక్కీ జే మేయర్ బ్లాస్ట్ చేయబోతున్నాడు’’ అనే క్యాప్షన్ జత చేశారు. అలాగే వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు సంక్రాంతి కానుకగా జనవరి 14న మా సినిమా విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చారు. అయితే ‘అనగనగా ఒక రాజు’ ఫస్ట్ సింగిల్‌కు నవీన్ పొలిశెట్టి ప్లే బ్యాక్ సింగర్‌గా వ్యవహరిస్తున్నారు.






