- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎవరూ ఊహించని క్రేజీ కాంబో సెట్.. స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న లేడీ సూపర్ స్టార్
ఈ సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. బాలీవుడ్ స్టార్ హీరోతో మన టాలీవుడ్ అగ్ర నిర్మాత సినిమా తీస్తుండటం మామూలు విషయం కాదు.

దిశ, సినిమా: కోలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా తన నటనతో సెగలు పుట్టిస్తున్న నయనతార, ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. షారుఖ్‌తో ‘జవాన్’ సెన్సేషన్ తర్వాత, ఇప్పుడు సల్మాన్‌తో రొమాన్స్ చేసేందుకు నయన్ రెడీ అయిపోయింది. అసలే ఫుల్ ఫామ్‌లో ఉన్న నయనతార, ఇప్పుడు సల్మాన్ సినిమాలో నటిస్తుందనే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. బాలీవుడ్ స్టార్ హీరోతో మన టాలీవుడ్ అగ్ర నిర్మాత సినిమా తీస్తుండటం మామూలు విషయం కాదు.
దిల్ రాజు తన ఎస్‌వీసీ (SVC) బ్యానర్‌పై ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట చర్చకు దారితీస్తున్నాయి. ఈ ముగ్గురి కాంబో సెట్ అవ్వడంతో .. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ వచ్చే ఏప్రిల్‌లో సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. వచ్చే ఏడాది ఈద్ (2027) పండుగకు ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ వార్త విన్నప్పటి నుంచి సల్మాన్, నయనతార అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ ఇద్దరు స్టార్స్ కెమిస్ట్రీ చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.






