- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టార్ హీరోపై మనసు పారేసుకున్న కృతి సనన్.. అతనితో చాలా ఎంజాయ్ చేశానంటూ కామెంట్స్
భాషతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు స్టార్ హీరో ధనుష్(Dhanush).

దిశ, సినిమా: భాషతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు స్టార్ హీరో ధనుష్(Dhanush). సింగర్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా ఇండస్ట్రీలో సత్తా చాటుతూ పలు సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్నారు. ధనుష్ నటిస్తున్న చిత్రాల్లో ‘తేరే ఇష్క్ మే’ (Tere Ishk Mein)ఒకటి. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో ధనుష్ సరసన కృతి సనన్ (Kriti Sanon)హీరోయిన్‌గా నటిస్తుండగా.. టి సిరిస్, ఎల్లో సంస్థ బ్యానర్స్‌పై గుల్షన్ కుమార్, ఆనంద్ ఎల్. రాయ్, భూషన్ కుమార్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని నవంబర్ 28న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది.
తాజాగా, ప్రమోషన్స్‌లో పాల్గొన్న కృతి సనన్ ధనుష్‌తో నటించడంపై తన అనుభవాన్ని పంచుకుంది. ‘‘ధనుష్ ఒక అసాధారణ నటుడు. పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన అనుభవం కలిగిన నటుడు. అతనితో నటించడానికి నేను ఎగ్జైటెడ్‌గా ఫీలయ్యాను. ఈ జర్నీలో ధనుష్ నుంచి చాలా నేర్చుకున్నాను. అతనితో కలిసి నటించడాన్ని చాలా ఎంజాయ్ చేశాను. మా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అందుకే మేమిద్దరం ఇంకా చాలా సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నాను. త్వరలోనే ‘తేరే ఇష్క్ మే’ చిత్రం రాబోతుంది. మీ అందరికీ మర్చిపోలేని అనుభూతిని ఇస్తుందని భావిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది. ధనుష్‌పై మనసు పారేసుకున్న ఆమె ఆయనను ప్రశంసలతో ముంచెత్తింది. కాగా.. ఈ సినిమాతో పాటు కృతి సనన్ బాలీవుడ్‌లో పలు ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. అలాగే తెలుగులోనూ ఆఫర్లు రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. అందుకు సోషల్ మీడియాను బాగానే వాడుకుంటోంది.






