బ్లాక్ బస్టర్ హిట్ ‘ప్రేమలు’ సీక్వెల్‌ విషయంలో ఊహించని ట్విస్ట్.. చర్చనీయాంశంగా మారిన నటుడి కామెంట్స్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-30 09:12:16  IST  )

‘ప్రేమలు-2’ స్క్రిప్ట్ వర్క్‌లో పలు సమస్యలు తలెత్తిన కారణంగా.. ప్రస్తుతానికి ఈ సినిమాను మొత్తానికే పక్కన పెట్టేసినట్లు ఆయన స్పష్టం చేశాడు.

బ్లాక్ బస్టర్ హిట్ ‘ప్రేమలు’ సీక్వెల్‌ విషయంలో ఊహించని ట్విస్ట్.. చర్చనీయాంశంగా మారిన నటుడి కామెంట్స్!
X

దిశ, సినిమా: మమిత బైజు, నస్లెన్, సంగీత్ ప్రతాప్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ చిత్రం ‘ప్రేమలు’. గిరీష్ ఏడీ దర్శకత్వంలో ఫుల్ లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ 2024లో థియేటర్స్‌లోకి వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. చిన్న సినిమాగా వచ్చి వంద కోట్లకి పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఈ మూవీ ఇచ్చిన భారీ విజయంతో.. మేకర్స్ సీక్వెల్‌గా ‘ప్రేమలు-2’ కూడా రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చి చాలా రోజులే అవుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి షూటింగ్ అప్‌డేట్ రాలేదు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక షాకింగ్ ట్విస్ట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ క్రేజీ సీక్వెల్ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి పూర్తిగా ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో నస్లెన్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించి ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చాడు. ‘ప్రేమలు-2’ స్క్రిప్ట్ వర్క్‌లో పలు సమస్యలు తలెత్తిన కారణంగా.. ప్రస్తుతానికి ఈ సినిమాను మొత్తానికే పక్కన పెట్టేసినట్లు ఆయన స్పష్టం చేశాడు. మొదటి భాగం అంత పెద్ద హిట్ అవ్వడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా కథ కుదరకపోవడం, స్క్రిప్టింగ్ లో లోపాలు ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ చేదు నిజం విని తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై నెటిజన్లు పలు రకాలుగా చర్చించుకుంటూ ఇలాంటి ట్విస్ట్ ఇస్తారని ఊహించలేదని అంటున్నారు.

BVS Ravi: పూరి జగన్నాథ్ ఆగి ఆలోచించే రకం కాదు

Next Story