BVS Ravi: పూరి జగన్నాథ్ ఆగి ఆలోచించే రకం కాదు

by Pulgam srinivas |

పూరి జగన్నాథ్ ఆగి, ఆలోచించి కథలు రాస్తే ఆయనను ఆపే వారు ఉండరని విజయేంద్ర ప్రసాద్ చెప్పిన మాటలు నిజమేనని బివిఎస్ రవి పేర్కొన్నారు.

BVS Ravi: పూరి జగన్నాథ్ ఆగి ఆలోచించే రకం కాదు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా ఎన్నో సంవత్సరాలు విజయవంతంగా కెరీర్‌ను కొనసాగించిన దర్శకుడు పూరి జగన్నాథ్. హీరో పాత్రలను ప్రత్యేకంగా డిజైన్ చేయడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకప్పుడు పూరి దర్శకత్వంలో హీరోగా నటించేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపేవారు. అయితే ఇటీవల కాలంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇదిలా ఉంటే ప్రముఖ కథా రచయిత, దర్శకుడు, నటుడు బివిఎస్ రవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్‌తో తన అనుబంధం, ఆయన వర్కింగ్ స్టైల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రవి మాట్లాడుతూ... పూరి జగన్నాథ్ గారితో చాలా కాలం ప్రయాణం చేశాను. ఆయన వర్కింగ్ స్టైల్ అద్భుతంగా ఉంటుంది. ఆయనతో పని చేయడం ఒక ప్రత్యేకమైన అనుభూతి. యూనిట్‌లో అందరికీ మంచి కంఫర్ట్ ఇస్తారు. ముఖ్యంగా సినిమా కథలను చాలా వేగంగా సిద్ధం చేయడం ఆయన ప్రత్యేకత” అని చెప్పారు. అయితే ఇటీవల కాలంలో పూరి కొంత స్లో అయ్యారని రవి అభిప్రాయపడ్డారు. అలాగే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒకసారి “పూరి జగన్నాథ్ కాస్త ఆగి, లోతుగా ఆలోచించి కథలు రాస్తే ఆయనను ఆపడం ఎవరి వల్లా కాదు” అని చెప్పారని గుర్తు చేశారు. “అది నిజమే. కానీ పూరి జగన్నాథ్ తన స్టైల్‌లోనే ముందుకు వెళ్తారు. ఎక్కువగా ఆగి ఆలోచించే వ్యక్తి కాదు” అంటూ రవి పేర్కొన్నారు. తాజాగా పూరి జగన్నాథ్ గురించి బివిఎస్ రవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story