- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పెద్ది’లో ఊహించని సర్‌ప్రైజ్.. .. పదేళ్ల తర్వాత కాంబో రిపీట్!
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో వెర్సటైల్ నటుడు సాయి కుమార్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంపై ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా, ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో వెర్సటైల్ నటుడు సాయి కుమార్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. రామ్ చరణ్, సాయి కుమార్ కాంబినేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా ‘ఎవడు’. సరిగ్గా పదేళ్ల క్రితం వచ్చిన ఆ చిత్రంలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ‘పెద్ది’ సినిమా కోసం ఈ ఇద్దరు నటులు స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం. సాయి కుమార్ పాత్ర ఇందులో చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, ఇప్పటికే ఆయనకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సీన్లను కూడా చిత్రబృందం చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు. కేవలం సాయి కుమార్ మాత్రమే కాకుండా.. జగపతి బాబు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, ‘మీర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు శర్మ వంటి హేమాహేమీలు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఇప్పుడు సాయి కుమార్ కూడా తోడవడంతో ‘పెద్ది’ స్టార్ కాస్ట్ మరింత స్ట్రాంగ్‌గా మారింది. ఒక వైపు చరణ్ మాస్ అప్పీల్, మరోవైపు బుచ్చిబాబు మార్క్ ఎమోషనల్ మేకింగ్.. కలిసి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. సాయి కుమార్ పాత్ర గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నప్పటికీ, ఈ కాంబో మళ్ళీ సెట్ అవ్వడం మాత్రం మెగా ఫ్యాన్స్‌కు పెద్ద సర్ ప్రైజ్ అనే చెప్పాలి.






