- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు ఊహించని సర్ ప్రైజ్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు ఒక అదిరిపోయే శుభవార్త అందింది.

దిశ, సినిమా: టాలీవుడ్‌లో గత కొంతకాలంగా రీ-రిలీజ్ (Re-release) ట్రెండ్ ఊపు అందుకున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు థియేటర్లలో సందడి చేసిన క్లాసిక్ సినిమాలు, బ్లాక్ బస్టర్ హిట్లు మళ్లీ వెండితెరపై మెరుస్తూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కొన్ని సినిమాలు అప్పట్లో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఇప్పుడు రీ-రిలీజ్‌లో మాత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తూ బ్లాక్ బస్టర్ అనిపించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు ఒక అదిరిపోయే శుభవార్త అందింది. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన సినిమా ‘రేసు గుర్రం’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇప్పుడు ఈ మూవీని మళ్లీ థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.
అల్లు అర్జున్ పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా, అభిమానుల కోరిక మేరకు ఏప్రిల్ 26న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయబోతున్నారు. ఈ రీ-రిలీజ్ వేడుకను మరింత స్పెషల్‌గా మార్చేందుకు ఏప్రిల్ 8న, అంటే బన్నీ బర్త్‌డే రోజున ‘రేసు గుర్రం’ రీ-రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఐకాన్ స్టార్ మాస్ మేనరిజమ్స్, శ్రుతి హాసన్ గ్లామర్, బ్రహ్మానందం కిల్ బిల్ పాండే కామెడీని మళ్లీ బిగ్ స్క్రీన్‌పై చూడబోతున్నామన్న వార్తతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. థియేటర్లలో మళ్ళీ ‘దేవుడా..’ అంటూ బన్నీ చేసే రచ్చ చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన పోస్టులు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.






