- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చివరి నిమిషంలో ఊహించని షాక్.. ‘వానర’ టైటిల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న మేకర్స్

దిశ, సినిమా: అవినాష్ తిరువీధుల (Avinash Tiruveedhula)హీరోగా, దర్శకుడిగా తెరకెక్కుతున్న సినిమా‘వానర’(vanara). ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీకి సెన్సార్ ప్రక్రియలో భాగంగా టైటిల్‌పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని సమాచారం. టైటిల్ చేంజ్ చేయాలంటూ సెన్సార్ సభ్యులు సూచనలు చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సెన్సార్ సభ్యుల అభిప్రాయం ప్రకారం, ‘వానర’ అనే పదం కొన్ని వర్గాలను లేదా భావోద్వేగాలను తప్పుగా ప్రతిబింబించే అవకాశం ఉందని, అలాగే సమాజంలో అపార్థాలకు దారి తీసేలా అర్థాలు తీసుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నారట. అందుకే ఈ టైటిల్‌తో సర్టిఫికెట్ ఇవ్వడం కష్టమవుతుందని, పేరు మార్చుకుంటేనే క్లియరెన్స్ సులభమవుతుందని సూచించినట్లు టాక్.
దీంతో చిత్రబృందం టైటిల్ మార్పుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న సినిమా కావడంతో, టైటిల్ తప్ప మిగతా కంటెంట్‌పై ఎలాంటి అభ్యంతరం లేదని సమాచారం. అవినాష్ తిరువీధుల టీమ్ కూడా ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా, సాఫీగా రిలీజ్ చేసేందుకు టైటిల్ మార్పునే ఉత్తమ మార్గంగా భావించినట్లు టాక్. ఈ సినిమాకు ‘వరవీర’టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. చివరి నిమిషంలో ఇలా జరగడంతో మూవీ మేకర్స్ కాస్త నిరాశ చెందుతున్నారు. అయితే ఇలా జరగడం ఇదే మొదటిసారి ఏం కాదు. ఇలాంటి సందర్భాలు గతంలో కూడా చోటుచేసుకున్నాయి. కొన్ని సినిమాలు సెన్సార్ సూచనల మేరకు టైటిల్ మార్చుకుని విడుదలై విజయాన్ని అందుకున్న ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు అవినాష్ తిరువీధుల మూవీ కూడా అలాగే రాబోతుంది. ఇక ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఎంత మేరకు మెప్పిస్తుందో చూడాలి?






