- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ది రాజాసాబ్’ షూట్‌లో ఊహించని అనుభవం.. ప్రభాస్ వల్ల చాలా ఇబ్బంది పడ్డా: నిధి అగర్వాల్
రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ది రాజా సాబ్’(The Raja Saab).

దిశ, సినిమా: రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ది రాజా సాబ్’(The Raja Saab). ఈ చిత్రాన్ని హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి(Maruthi). పీపుల్ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్(Nidhi Agarwal), రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తుండగా.. యోగిబాబు, సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న ‘ది రాజా సాబ్’ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా, జరిగిన ఈవెంట్‌లో నిధి అగర్వాల్ ప్రభాస్‌తో నటించిన అనుభవాలను పంచుకుంది. ‘‘ప్రభాస్‌తో పనిచేయడం నా కెరీర్‌లో ఒక పెద్ద మైలురాయి. అయినప్పటికీ నేను ఇబ్బంది పడ్డాను.
ఆయన ఆరు అడుగులకు పైగా ఎత్తు ఉండటంతో.. ఆయనకు సరితూగడానికి నేను షూట్‌లో ఎత్తు పెంచే స్టాండ్ వేసుకోవాల్సి వచ్చింది. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. నా కెరీర్‌లో తొలిసారి నా హైట్ విషయంలో చాలా ఫీల్ అయ్యా. స్క్రీన్ ప్రెజెన్స్ చూసి మొదట్లో కొంచెం టెన్షన్ పడ్డాను. కానీ ప్రభాస్ చాలా సపోర్టివ్ నన్ను ఎంతో కంఫర్ట్‌గా ఉంచారు. గ్రీస్‌లో జరిగిన సాంగ్ షూటింగ్‌లో బయట ఫుడ్ కాకుండా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కానుంచి రాత్రి డిన్నర్ వరకు నేను స్వయంగా వండుకున్నాను. అంతేకాకుండా ఈ సినిమా కోసం మరో సాహసం చేశాను. నా కెరీర్‌లో మొదటిసారి తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాను. ప్రేక్షకులకు మరింత దగ్గర కావడానికి నావంతు ప్రయత్నం చేశాను. ఇది నా కెరీర్‌లో టర్నింగ్ పాటింగ్ అవుతుందని భావిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది.






