‘దేవర’లో జాన్వీ అలాంటి క్యారెక్టర్‌లో నటిస్తుందా!?

by Disha Web Desk 10 |
‘దేవర’లో జాన్వీ అలాంటి క్యారెక్టర్‌లో నటిస్తుందా!?
X

దిశ, సినిమా: జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న ‘దేవర’లో జాన్వీ కపూర్ నటించబోయే పాత్రపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. బాలీవుడ్‌లో ఇప్పటికే తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి ఈ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేస్తుంది. ఇక దేవర నుంచి ఇటీవల విడుదలైన జాన్వీ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను అట్రాక్ట్ చేయగా.. ఈ మూవీలో జాన్వీ నెగెటివ్‌ రోల్‌ పోషించబోతున్నట్లు తెలుస్తోంది. స్టోరీ డిమాండ్ మేరకు ఆమె రెండు భిన్న పార్శాలు కలిగిన క్యారెక్టర్‌లో కనిపిస్తుందని, మూవీ సెకండ్ పార్ట్‌లోనూ అదే నెగెటివ్‌ రోల్ కొనసాగించబోతున్నట్లు సమాచారం. ఇక తన క్యారెక్టర్‌లోని సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్స్‌ నచ్చడం వల్లే ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించిందని, దక్షిణాదిలో తన కెరీర్‌కు శుభారంభాన్నిచ్చే సినిమా ఇదే అవుతుందనే ధీమాతో ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Next Story

Most Viewed