Pawan Kalyan 'Ustad Bhagat Singh' సినిమా నుండి అదిరిపోయే అప్డేట్..

by Mallepaka Hamsa |   (  Updated:2022-12-30 03:42:32  IST  )

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు..

Pawan Kalyan Ustad Bhagat Singh సినిమా నుండి అదిరిపోయే అప్డేట్..
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా రాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే పవన్ కల్యాన్ 'హరి హర వీరమల్లు' మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కాబట్టి 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో అని పవన్ ఫ్యాన్స్ పలు సందేహాలతో ఎదురు చూస్తున్నారు. తాజాగా, చిత్రబృందం ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. ''ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైయ్యాయి. త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుంది'' అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్టర్ ద్వారా తెలిపారు. అంతేకాకుండా ఆర్ట్‌ డైరెక్టర్ ఆనంద్ సాయికి మూవీ కాన్సెప్ట్‌ డిజైన్‌ గురించి దర్శకుడు హరీష్‌ శంకర్‌ వివరిస్తున్న ఫొటోలను షేర్ చేసింది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story