బాలయ్య ‘NBK108’ నుంచి అదిరిపోయే అప్డేట్

by Disha Web Desk 6 |
బాలయ్య ‘NBK108’ నుంచి అదిరిపోయే అప్డేట్
X

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘NBK108’. ఇందులో కాజల్ అగర్వాల్, శ్రీ లీల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల వీర సింహారెడ్డి లాంటి మాస్ కమర్షియల్ సినిమాలో మెప్పించిన సంగతి తెలిసిందే. దీంతో ‘NBK108’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. షైన్ స్కీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ విజయ దశమికి ఆయుధపూజ నిర్వహించనున్నట్లు ఓ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అంతేకాకుండా రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. దీంతో అది చూసిన నెటిజన్లు ‘జై బాలయ్య’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

‘విజయదశమికి ఆయుధపూజ’.. ‘#NBK108’ నుంచి బిగ్ అప్‌డేట్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఈ సినిమాను ఎందుకు పక్కన పెడుతున్నారు?

Next Story