- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా కెరీర్‌ను మలుపు తిప్పే ఒక అద్భుత ప్రయాణం: ప్రియాంక చోప్రా
భారతదేశం గర్వించదగ్గ గొప్ప దర్శకుడు రాజమౌళి గారి దర్శకత్వంలో నటించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.

దిశ, సినిమా: హాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస ప్రాజెక్టులతో ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra), ఇప్పుడు టాలీవుడ్‌ను షేక్ చేసేందుకు సిద్ధమైంది. దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli)- సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా ఈ సినిమాపై ప్రియాంక చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రియాంక నటించిన అంతర్జాతీయ చిత్రం ‘ది బ్లఫ్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె రాజమౌళి ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. ‘‘భారతదేశం గర్వించదగ్గ గొప్ప దర్శకుడు రాజమౌళి గారి దర్శకత్వంలో నటించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. నా కెరీర్‌ను మలుపు తిప్పే ఒక అద్భుత ప్రయాణం ఇది. ఈ సినిమా కోసం నేను కూడా ప్రేక్షకుల్లాగే వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాను.
ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వచ్చి రచ్చ చేస్తుందో అని చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది’’ అని ప్రియాంక ఆనందం వ్యక్తం చేసింది.అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా 'మందాకిని' అనే అత్యంత పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతోంది. జక్కన్న సినిమాల్లో హీరోయిన్లకు ఉండే ప్రాముఖ్యత గురించి తెలిసిందే, అందుకే ప్రియాంక పాత్ర ఈ కథలో కీలక మలుపుగా ఉంటుందని సమాచారం. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని హాలీవుడ్ నిర్మాణ విలువలకి ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబు మేకోవర్ నుంచి ప్రియాంక రోల్ వరకు ప్రతిదీ అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.






