అలాంటి క్యారెక్టర్‌లో కనిపించినందుకు హ్యాపీగా ఉంది: 'జోగి' పాత్రపై అమైరా

by Disha Web Desk 16 |
అలాంటి క్యారెక్టర్‌లో కనిపించినందుకు హ్యాపీగా ఉంది: జోగి పాత్రపై అమైరా
X

దిశ, సినిమా: యంగ్ సెన్సేషన్ అమైరా దస్తూర్ నటించిన తాజా చిత్రం 'జోగి'. సెప్టెంబర్ 16న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ అమైరా క్యారెక్టర్‌పై నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. జోగికి కాలేజ్ మేట్, స్నేహితురాలైన ఆమె పాత్ర కేవలం సినిమా మధ్యలో వచ్చే 'తఫ్రియన్' పాట చుట్టూ కేంద్రీకృతమై ఉండటం, చివర్లో ఫ్లాష్‌బ్యాక్‌లో కనిపించడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాజాగా స్పందించిన ఆమె.. ఇలాంటి చిన్న పాత్రలో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.

'నేను ఎప్పుడూ అలా ఆలోచించే వ్యక్తిని కాదు. ఒక నిమిషం పాత్ర అయినా ప్రేక్షకులను ప్రభావితం చేసేలా ఉంటే ఎప్పటికీ నిలిచిపోతుందని భావిస్తున్నా. కాబట్టి స్క్రీన్ మీద కనిపించే సమయంతో సమస్య లేదు. ప్రేక్షకులకు ఆ జ్ఞాపకాన్ని మిగిల్చాలి. ఎప్పుడూ వాల్‌ఫ్లవర్‌గా ఉండాలని కోరుకోలేదు. నేను పోషించిన పాత్ర సరదాగా ఉంటుంది. ఎంతో నిర్భయమైనది. మధురమైనది. నేనెప్పుడూ ఇలాంటి క్యారెక్టర్‌ని పోషించలేదు. దీనిపై చాలా స్వేచ్ఛగా, సంతోషంగా ఉన్నా' అని వివరిచింది. చివరగా 'జోగి' సినిమా హృదయాలకు హత్తుకునేలా ఉందని, కాబట్టి ఎవరినీ కించపరచాల్సిన అవసరం లేదని పేర్కొంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది.

Also Read: చేతిలో మందు సీసాలతో రచ్చ రచ్చ చేస్తున్న హాట్‌ బ్యూటీ


Next Story

Most Viewed