నీ కాళ్ల మీద పడమంటావా..? అమితాబ్ బచ్చన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Disha Web Desk 19 |
నీ కాళ్ల మీద పడమంటావా..? అమితాబ్ బచ్చన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సబ్‌స్క్రిప్షన్ ఫీజులను చెల్లించని వారికి ట్విట్టర్ బ్లూటిక్‌ను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ వెరిఫైడ్ టిక్ పోయిందంటూ ఫన్నీ ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా తన ఖాతా బ్లూటిక్ కోల్పోవడంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ స్పందించారు. ‘హే ట్విట్టర్! వింటున్నావా? నేను సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ కోసం డబ్బులు చెల్లించాను. దయచేసి నా బ్లూ లోటస్(టిక్) తిరిగి ఇవ్వండి. తద్వారా నేను అమితాబ్ బచ్చన్‌ని అని ప్రజలు తెలుసుకుంటారు. నేను మిమ్మల్ని చేతులు జోడించి మరీ అభ్యర్థిస్తున్నాను. మీ కాళ్ల మీద కూడా పడాలా?’ అని బిగ్ బీ ఫన్నీ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read...

అధికార పార్టీ ఎంపీని పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్.. మ్యారేజ్ ఎప్పుడంటే..?

Next Story

Most Viewed