అమితాబ్ బచ్చన్ నన్ను కిడ్నాప్ చేసి మాఫియాకు అప్పగించాలనుకున్నాడు: పర్వీన్

by Bhoopathi Nagaiah |

ఎవరూ నమ్మిన నమ్మకపోయినా బాలీవుడ్‌కు, మాఫియాకు విడదీయలేని అనుబంధం ఉందని చాలా రకాల వార్తలు వినిపించాయి.

అమితాబ్ బచ్చన్ నన్ను కిడ్నాప్ చేసి మాఫియాకు అప్పగించాలనుకున్నాడు: పర్వీన్
X

దిశ, సినిమా: ఎవరూ నమ్మిన నమ్మకపోయినా బాలీవుడ్‌కు, మాఫియాకు విడదీయలేని అనుబంధం ఉందని చాలా రకాల వార్తలు వినిపించాయి. బాలీవుడ్ నుంచి అనేక మంది హీరోయిన్స్, హీరోస్‌ను మాఫియా పెంచి పోషించేదని, చాలా మంది హీరోలు వీకెండ్‌లో మాఫియాతో మీటింగ్‌లో ఉండేవారట. వారు చెప్పినట్టు వినకపోతే హీరోలకు భవిష్యత్తు ఉండేది కాదట. ఇక హీరోయిన్స్ అవకాశాలు రావు అనే బెదిరింపులు ఎక్కువగా ఉండేవని సమాచారం. అయితే తాజాగా నటి పర్వీన్ బాబీ చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

‘అమితాబ్ బచ్చన్ సైతం మాఫియాతో అండర్ వరల్డ్ డాన్స్‌తో సంబంధాలు కలిగి ఉన్నాడు. అమితాబ్ కూడా ఒక అండర్ వరల్డ్ డాన్. అతడు నన్ను కిడ్నాప్ చేసి మాఫియాకి అప్పగించాలని చూశాడు. ఈ విషయం తెలిసిన కూడా దానిమీద ఎలాంటి ఎంక్వయిరీ కానీ పోలీస్ కేసు కానీ నమోదు కాలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు నాకు మతిస్థిమితం లేదు అనే వార్తలు వైరల్ చేశారు’ అంటూ పర్వీన్ బాబీ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.

Next Story