- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమితాబ్ బచ్చన్‌కు భయంకర అనుభవం.. షాకింగ్ వీడియో వైరల్
ఇటీవల సినీ సెలబ్రిటీల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

దిశ, సినిమా: ఇటీవల సినీ సెలబ్రిటీల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒక సంఘటన మరువముందే మరో ఘటన చోటుచేసుకుంటూ, సెలబ్రిటీలకు జనావాసాల్లోకి రావడమే భయంగా మారుతోంది. అభిమానుల పేరుతో కొందరు హద్దులు దాటి ప్రవర్తించడం వల్ల స్టార్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే పబ్లిక్ ఈవెంట్లు, కార్యక్రమాల్లో పాల్గొనాలంటే సెలబ్రిటీలు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల హీరోయిన్ నిధి(Nidhi Agarwal), సమంత(Samantha)లకు ఎదురైన అనుభవాలు ఇంకా చర్చలో ఉండగానే, తాజాగా ఓ లెజెండరీ స్టార్ హీరోకు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురవడం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఆ స్టార్ మరెవరో కాదు.. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan).
వివరాల్లోకి వెళితే, అమితాబ్ బచ్చన్ సూరత్ ఎయిర్‌పోర్ట్‌లో ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఒక్కసారిగా జనాలు గుమిగూడటంతో ఆయన కారు వద్దకు చేరుకోవడం కూడా కష్టంగా మారింది. ఈ క్రమంలో అభిమానులు చుట్టుముట్టడంతో విమానాశ్రయ ఎంట్రీ వద్ద ఉన్న గ్లాస్ ఒక్కసారిగా పగిలిపోయి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో అమితాబ్ కొద్దిగా పక్కకు ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే తీవ్ర భద్రత మధ్య ఆయనను అక్కడి నుంచి సురక్షితంగా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు షాక్ అవుతూ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం సెలబ్రిటీలకు ఇబ్బంది కలిగించడం బాధాకరమని కామెంట్స్ చేస్తున్నారు.
Read More..






