- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లులు మాల్ ఘటనపై నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్స్
లులు మాల్ సంఘటనపై నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్స్ చేసారు. లులు మాల్ సంఘటన దురదృష్టకరం అంటూ మండిపడ్డారు. దాని గురించి ఇప్పుడే మాట్లాడబోను.. సమయం వచ్చినప్పుడు అందరి పని చెబుతానంటూ హెచ్చరించారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్, బడా హీరోల సరసన వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఆమె కెరీర్ మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లతో కూడా సినిమాలు చేసింది. ఇక లేటెస్ట్ గా ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా మెరువనుంది నిధి అగర్వాల్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రేపు రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా ఈవెంట్ లో భాగంగా లులు మాల్ వెళ్ళింది నిధి అగర్వాల్. అయితే ఈవెంట్ పూర్తయిన తర్వాత, హోటల్ కు వెళ్లే సమయంలో నిధి అగర్వాల్ కు ఊహించని పరిణామం ఎదురైంది. జనాలందరూ మీద పడిపోయారు. ఈ సంఘటన వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
లులు మాల్ సంఘటనపై నిధి సీరియస్
లులు మాల్ సంఘటన టాలీవుడ్ ఇండస్ట్రీలో నిలిచిపోతుంది. అయితే అలాంటి ఘటనపై తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్స్ చేసారు. లులు మాల్ సంఘటన అత్యంత దురదృష్టకరం అంటూ మండిపడ్డారు. దాని గురించి ఇప్పుడే మాట్లాడబోను.. సమయం వచ్చినప్పుడు అందరి పని చెబుతానంటూ హెచ్చరించారు. ఈ సమయంలో పొరపాటున నేను ఏదైనా మాట్లాడితే, పరిణామాలు వేరేలాగా ఉంటాయని ముందు జాగ్రత్తతో ఆమె పేర్కొన్నారు. కాస్త సమయం తీసుకొని దానిపై స్పందిస్తానని వివరించారు. ది రాజా సాబ్ సినిమా తర్వాత మూడు సినిమాలు లైన్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. 2026 సంవత్సరంలో తాను ఫుల్ బిజీగా ఉంటానని కూడా క్లారిటీ ఇచ్చారు నిధి అగర్వాల్.






