- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
50 ఏళ్ల వయసులో పెళ్లి.. అలాంటి వ్యక్తినే చేసుకుంటానంటూ అమీషా పటేల్ షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ నటి అమీషా పటేల్(Amisha Patel) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
దిశ, సినిమా: బాలీవుడ్ నటి అమీషా పటేల్(Amisha Patel) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హిందీలోనే కాకుండా ఆమె తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), మహేష్ బాబు(Mahesh Babu), బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. 50 ఏళ్లు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్యాచ్‌లర్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. అలాగే వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమీషా పటేల్ షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.
‘‘ఇన్నాళ్లు నాకు చాలా ప్రమోజల్స్ వచ్చాయి. నా వయసులో సగం వయసు ఉన్నవారు కూడా నన్ను పెళ్లి చేసుకుంటామని అంటున్నారు. కానీ వాళ్లంతా నా నటనకు దూరం కావాలని నాకు కండీషన్ పెడుతున్నారు. అందుకే అందరినీ తిరస్కరించాను. ఎప్పటికైనా మనల్సి ప్రేమించే వాళ్లు మనం కెరీర్‌లో ముందుకు వెళ్లాలని అనుకోవాలి. నేను నా జీవితంలో చాలా కోల్పోయాను. గతంలో ఒకరిని ప్రేమించా పెళ్లి కూడా చేసుకుందామనుకునే సమయంలో కండీషన్ బయటపెట్టాడు. దీంతో బ్రేకప్ చెప్పి అతన్ని వదిలేశాను. నేను పెళ్లికి వ్యతిరేకం కాదు. కానీ నాకు తగిని వ్యక్తి కనిపించినప్పుడు.. నన్ను నటించమని ప్రోత్సహించే వారు దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. ఈ విషయాన్ని నేనే త్వరలో ప్రకటిస్తాను.. కానీ పుకార్లు ప్రచారం చేయకండి’’ అని చెప్పుకొచ్చింది.








