అది ఆధ్యాత్మికం కాదు.. అందాల ఆరబోతకు షార్ట్ కట్

by Disha Web Desk 6 |
అది ఆధ్యాత్మికం కాదు.. అందాల ఆరబోతకు షార్ట్ కట్
X

దిశ, సినిమా: ఆధ్యాత్మికం పేరిట పంచభూతాలను ప్రస్తావిస్తూనే అందాలు ఆరబోసిన అమలాపాల్ నెట్టింట దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. ఇటీవల ఓ కొలనులో రెడ్ కలర్ క్లాత్ చుట్టుకుని జలకాలాడుతూ పరమ భక్తితో పూజలు చేసిన నటి.. డిఫరెంట్ స్టిల్స్‌తో ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. అంతేకాదు 'నేను మార్చలేని విషయాల్లో నీటి ప్రవాహం వంటి అంగీకరించే శక్తిని కోరుకుంటున్నా.

నేను చేయాలనుకుంటున్న పనుల కోసం అగ్నిలాంటి శక్తి కావాలి. అవగాహనా సామర్థ్యం కోసం గాలిలాంటి శక్తి కావాలి. నా గమ్యాన్ని తెలుసుకుని ముందుకు సాగడానికి భూమిలాంటి శక్తిని ప్రసాదించు. నన్ను ఆశీర్వదించు' అంటూ దైవాన్ని కోరుకుంటున్నట్లు క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ తెగ వైరల్ అవడంతో నెటిజన్లు నెగెటివ్ కామెంట్లతో రెచ్చిపోయారు. 'ఆధ్యాత్మికం కాదు అందాల ఆరబోత', 'కామాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతోంది' అంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు.



Next Story

Most Viewed