- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వినోదంతో పాటు విజ్ఞానం కూడా మా సినిమాలో దొరుకుతుంది: రాజ్ నరేంద్ర
తెలంగాణ పల్లెటూరి బ్యాక్ డ్రాప్‌లో చిత్రీకరించిన అరుదైన సినిమా ‘కలివి వనం’(kalivi vanam).

దిశ, సినిమా: తెలంగాణ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించిన అరుదైన సినిమా ‘కలివి వనం’(kalivi vanam). ఇందులో రఘుబాబు(Raghubabu), సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్, సతీష్ శ్రీ చరణ్, అశోక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. హీరోయిన్‌గా నాగదుర్గ(Nagadurga) పరిచయమవుతోంది. ‘కలివి వనం’ సినిమాను ఏఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ నరేంద్ర దర్శకత్వంలో మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిలు నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 21న విడుదల కాబోతుంది. ఈనేపథ్యంలో..తాజాగా, మూవీ మేకర్స్ ట్రైలర్ లాంచ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. దర్శకుడు రాజ్ నరేంద్ర (Raj Narendra)మాట్లాడుతూ .. ఈ రోజుల్లో ఒక చిన్న సినిమాకి ఒక గెస్ట్‌ని తీసుకురావడం చాలా కష్టం. గెస్టుల కోసం మేము చాలా రోజులు ట్రై చేశాం. వస్తామన్నారు, రాలేదు.
ఒక మంచి సినిమాను ఆదరించడానికి ఈ ఫీల్డ్‌లో ఒక గెస్ట్ కూడా రాలేకపోతున్నారు. ఈరోజు మాకు అండగా ఉన్నది మీడియా మిత్రులు మాత్రమే. వాళ్లే మా బలం, మా బలగం, వాళ్లే మా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి తల్లిదండ్రులను నేను కోరుకునేది ఒక్కటే, ఈ చిత్రాన్ని మీ పిల్లలకు చూయించండి. ఎందుకు చూయించాలంటే ఇది వాళ్ళ జీవిత శైలిలో ఒక పాఠ్య భాగం లాగా, ఒక పెద్ద భాల శిక్షలో ఒక పేజీ లాగా ఈ సినిమా వాళ్ళ మైండ్‌లో ఉండిపోతుంది. ఇది పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానం కూడా ఈ సినిమాలో దొరుకుతుంది. ఈ నవంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ ‘కలివి వనం’ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని చెప్పారు.






