శిరీష్‌కు కాబోయే భార్యను సైడ్ చేసేసిన అల్లు స్నేహ.. తెలివైనదే అంటున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-22 08:16:52  IST  )

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ(Allu Sneha Reddy)కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

శిరీష్‌కు కాబోయే భార్యను సైడ్ చేసేసిన అల్లు స్నేహ.. తెలివైనదే అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ(Allu Sneha Reddy)కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తన కుటుంబానికి సంబంధించిన పోస్టులు పెడుతుంటుంది. ఇక ఆమె చేసే పోస్టులు నిమిషాల్లోనే వైరల్ అవుతాయనడంలో అతిశయోక్తి లేదు. అల్లు స్నేహ రెడ్డి దీపావళి సందర్భంగా కుటుంబంతో తీసుకున్న ఫొటోలను షేర్ చేసింది. ఇక ఇందులో తన మర్ది అల్లు శిరీష్‌(Allu Sirish)కు కాబోయే భార్య కూడా ఉండటం విశేషం. ఇప్పటి వరకు అల్లు ఫ్యామిలీ ఆమెను ఎక్కడా చూపించనప్పటికీ పొరపాటున స్నేహ నెట్టింట పెట్టడంతో అది కాస్తా వైరల్ అయింది. దీంతో వెంటనే జాగ్రత్త పడిన ఆమె అందులో ఉన్న తన తోటి కోడలిని సైడ్ చేసి.. మరో పోస్ట్ పెట్టింది. అయినప్పటికీ ఈ ఫొటోలను స్క్రీన్ షార్ట్ తీసుకున్న కొందరు నెట్టింట షేర్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం అల్లు స్నేహ తెలివైనదే.. అందుకే తోటి కోడలు కనిపించకుండా సైడ్ చేసిందని అంటున్నారు.

కాగా.. టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ ఇటీవల పెళ్లి ప్రకటనతో అందరికీ షాకిచ్చిన విషయం తెలిసిందే. గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పబోతున్నాడు. ఇక అక్టోబర్ 30న నయనికతో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు ప్రకటన విడుదల చేయడంతో అంతా షాక్ అయ్యారు. కానీ కాబోయే భార్య ఫొటోలను మాత్రం షేర్ చేయకుండా జాగ్రత్త పడ్డాడు. దీంతో అప్పటి నుంచి అల్లు కుటుంబానికి కాబోయే కోడలిని చూడాలని ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో.. దీపావళి సందర్భంగా స్నేహ రివీల్ చేయడంతో అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇక అల్లు ఫ్యామిలీకి చిన్న కోడలిగా వెళ్లబోతున్న నయనిక విషయానికొస్తే..హైదరాబాద్‌కి చెందిన నయనిక, శిరీష్ గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. త్వరలో ఎంగేజ్‌మెంట్ ఉండటంతో.. నయనిక (Nayanika)అత్తారింట్లో దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంది. చమ్కీల డ్రెస్ ధరించిన నయనిక కాబోయే భర్త పక్కన కూర్చొని మురిసిపోయింది. ఇక ఆమెను చూసినవారంతా హీరోయిన్‌లా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఒక్క ఫొటోతో అల్లు స్నేహ సోషల్ మీడియాను షేక్ చేసిందని చెప్పాలి.

READ MORE ......

Deepika Padukone: కూతురి ఫేస్ రివీల్ చేసి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన దీపికా.. పాప ఎంత ముద్దుగా ఉందో!

Next Story