బన్నీకి సిగ్నల్ ఇస్తున్న స్నేహ.. పోస్ట్ వైరల్

by Disha Web Desk 17 |
బన్నీకి సిగ్నల్ ఇస్తున్న స్నేహ.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఎమోషనల్ పోస్ట్‌తో నెట్టింట దర్శనమిచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తన భర్తపై ప్రేమ కురిపిస్తున్న ఫొటోతో దర్శనమిచ్చి నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె హైదారాబాద్‌లో ఉండగా అల్లు అర్జున్ 'పుష్ప ది రూల్' షూట్ కోసం వైజాగ్‌లో ఉన్నాడు. దీంతో భర్తకు దూరంగా ఉన్నందున విరహ వేదనకు గురవుతున్నట్లు కనిపించిన స్నేహ.. బన్నీని కౌగిట్లో బంధించిన ఫొటోను షేర్ చేసింది. అంతేకాదు భర్తను ట్యాగ్ చేస్తూ 'మిస్ యూ' అని ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో వైరల్ అయిన ఫొటోపై స్పందిస్తున్న ఫ్యాన్స్.. 'తన భర్తకు ఇలా దూరంగా ఉండలేకపోతోంది పాపం. త్వరగా రమ్మని బన్నీకి సిగ్నల్ ఇస్తోంది' అంటూ రకరకాలుగా చర్చిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Prabhas సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది: Kriti Sanon


Next Story

Most Viewed