- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీరు లేకపోయినా ఆ ప్రేమను నేను ఇస్తానంటూ అల్లు శిరీష్ పోస్ట్.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
ఆమెపై మీరు చూపించిన అదే ప్రేమను, ఈ భూమిపై నేను ఉన్నంత కాలం ఆమెకు అందిస్తూనే ఉంటాను

దిశ, సినిమా: మెగా కాంపౌండ్ హీరో అల్లు శిరీష్ ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యారు. తన ప్రియురాలు నయనికతో కలిసి మార్చి 6న వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు వేశారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు మెగా కుటుంబ సభ్యులతో పాటు, అల్లు- నయనిక కుటుంబాలకు చెందిన సన్నిహితులు, సినీ రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను దీవించారు. పెళ్లి తర్వాత తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటూ అల్లు శిరీష్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. తనకు పిల్లనిచ్చిన (నయనిక తండ్రి) మామగారిని తలుచుకుంటూ శిరీష్ పెట్టిన మెసేజ్ నెట్టింట వైరల్ అవుతోంది. దురదృష్టవశాత్తూ నయనిక తండ్రి ఇప్పుడు మన మధ్య లేరు.
ఈ నేపథ్యంలో ఆయన ఫోటోను షేర్ చేస్తూ శిరీష్ ఇలా రాసుకొచ్చాడు. ‘‘మావయ్య, మిమ్మల్ని ప్రత్యక్షంగా కలిసే అవకాశం నాకు రాలేదు. కానీ, నేను ఈ రోజు నా భార్యగా పిలుచుకుంటున్న ఈ అద్భుతమైన మహిళను మీరు ఇంత గొప్పగా పెంచినందుకు మీకు ధన్యవాదాలు. ఆమెపై మీరు చూపించిన అదే ప్రేమను, ఈ భూమిపై నేను ఉన్నంత కాలం ఆమెకు అందిస్తూనే ఉంటాను’’ అని రాసుకొచ్చారు. భార్య తండ్రిపై శిరీష్ చూపిన ఈ గౌరవం, ప్రేమను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. శిరీష్, మీరు చాలా గొప్ప మనసున్న వ్యక్తి.. నయనిక చాలా అదృష్టవంతురాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అత్తగారింట్లో అడుగుపెట్టిన కొత్తలోనే మామగారి బాధ్యతను తన భుజాన వేసుకుంటానని శిరీష్ చెప్పడం విశేషం. ప్రస్తుతం అల్లు శిరీష్, నయనికల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉన్నాయి.






