- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో అల్లు శిరీష్ లవర్.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ కొడుకు అల్లు శిరీష్(Allu Sirish) త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ కొడుకు అల్లు శిరీష్(Allu Sirish) త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. గత కొద్ది కాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఆయన బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పబోతున్నాడు. ఇక ఇటీవల తన ఎంగేజ్‌మెంట్ ప్రకటనతో అందరికీ బిగ్ షాకిచ్చాడు. అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా అక్టోబర్ 1న నైనికా అనే అమ్మాయిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించాడు. ఇక కొద్ది కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెద్దలను ఒప్పించి అక్టోబర్ 31న ఘనంగా నిశ్చితార్థం చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని అల్లు శిరీష్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించడంతో.. ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ అయిపోయింది.
అయితే శిరీష్, నైనికా ముఖం కనిపించకుండా.. వారిద్దరు చేతులు పట్టుకుని దిగిన పిక్ మాత్రమే షేర్ చేయడం గమనార్హం. దీంతో అసలు ఆమె ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తితో నెటిజన్లు నైనికాకు సంబంధించిన విషయాలను తెగ సెర్చ్ చేస్తున్నారు. అసలు ఆమె ఎవరు? శిరీష్‌కు ఎలా పరిచయం వీరిద్దరి ప్రేమ ఎక్కడ మొదలైంది.. అల్లు వారింటికే కోడలు కాబోతుందంటే ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనే ప్రశ్నలు వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, అల్లు శిరీష్‌కు కాబోయే భార్యకు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నైనికా(Nainika) రెడ్డి అమ్మాయి అని తెలుస్తోంది. ఆమె తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి అని టాక్. ఇక నైనికా కూడా అల్లు స్నేహారెడ్డి లాగా బాగా రిచ్ అని పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. అల్లు శిరీష్‌కు కట్నం కూడా భారీగానే ఇస్తున్నట్లు పుకార్లు జోరందుకున్నాయి. అంతేకాకుండా నైనికాకు సంబంధించిన పలు పోస్టులు సైతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు అల్లు శిరీష్ మొత్తానికి సౌండ్ పార్టీనే లవ్ చేశాడని అంతా పలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.






