- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Allu Sirish: నెక్లెస్ ధరించడం ట్రోల్స్.. పెళ్లికి వడ్డానం పెట్టుకుంటే ఏమైపోతారో అంటూ అల్లు శిరీష్ షాకింగ్ రిప్లై!
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్(Allu Sirish) గౌరవం, ఒక్క క్షణం, బడ్డీ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో అల్లు శిరీష్(Allu Sirish) గౌరవం, ఒక్క క్షణం, బడ్డీ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. కానీ సరైన హిట్ రాకపోవడంతో తన పాపులారిటీని పెంచుకోలేకపోయాడు. గత ఏడాది నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఈక్రమంలోనే.. ఆయన బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకోబోతున్నాడంటూ పలు వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో అల్లు శిరీష్ ఈ విషయంపై సోషల్ మీడియా ద్వారా అధికారికంగా స్పందించారు. అక్టోబర్ 31న నయనిక (Nayanika)అనే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నట్లు చెప్పడంతో ఒక్కసారిగా అంతా షాకయ్యారు. సడెన్ షాకిచ్చాడని.. అల్లు ఇంటికి కాబోయే కోడలు ఎవరో తెలుసుకోవాలని తెగ ట్రై చేశారు.
చూస్తుండగా.. అల్లు శిరీస్ ఎంగేజ్‌మెంట్ సమయం రానేవచ్చింది. ఆయనకు కాబోయే భార్య ఫొటోలు.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోయాయి. మరీ ముఖ్యంగా నిశ్చితార్థం తర్వాత అల్లు శిరీష్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పిక్స్ సంచలనంగా మారాయనడంతో అతిశయోక్తి లేదు. ఎందుకంటే.. ఆయన అందులో నెక్సెస్ వేసుకుని కనిపించడంతో అంతా ఆశ్చర్యపోయారు. అంతా బాగానే ఉంది కానీ మగవాడు అయి ఉండి నెక్సెస్ ధరించడం ఏంటి.. చెండాలంగా ఉందంటూ ఫొటోలపై ట్రోల్స్ చేశారు. అయితే ఈ నెక్సెస్ ధర ఏకంగా రూ. 10వేల డాలర్ల వరకు ఉంటుందనే ప్రచారం కూడా జరిగింది. ఈ ఫొటోలపై ట్రోల్స్, విమర్శలతో పాటు మీమ్స్ కూడా క్రియేట్ చేశారు.
తాజాగా, ఈ విషయంపై అల్లు శిరీష్ ట్విట్టర్ ద్వారా స్పందించి ట్రోలర్స్‌కు గట్టిగా ఇచ్చిపడేశాడు. ‘‘హహహ. మన తెలుగు మీమ్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి! వడ్డానం అనేది స్త్రీలు మాత్రమే ధరిస్తారు. కానీ మన భారతీయ మహారాజులు, మొఘలులు కూడా చోకర్లు ధరిస్తారు. ఒకప్పటి రాజులంతా చోకర్లు ధరించారు’’ అని నెక్లెస్ వేసుకున్న మహారాజుల ఫొటోలను షేర్ చేశాడు.అంతేకాకుండా నెక్లెస్‌కే ఇలా అయిపోతే.. పెళ్లికి వడ్డానం పెట్టుకుంటే ఏమైపోతరో అనే మీమ్ కూడా పెట్టాడు. అంటే అలా కూడా ట్రై చేస్తానని హింట్ ఇచ్చాడన్నమాట. ఇక అది తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు.






