Allu Sirish: నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు ప్రకటించి షాకిచ్చిన అల్లు శిరీష్.. అమ్మాయి ఎవరంటే?

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్(Allu Sirish) బ్యాచ్‌లర్‌ లైఫ్‌కు గుడ్ చెప్పి పెళ్లి పీటలెక్కబోతున్నాడు.

Allu Sirish: నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు ప్రకటించి షాకిచ్చిన అల్లు శిరీష్.. అమ్మాయి ఎవరంటే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్(Allu Sirish) బ్యాచ్‌లర్‌ లైఫ్‌కు గుడ్ బై చెప్పి పెళ్లి పీటలెక్కబోతున్నాడు. మెగా కుటుంబానికి చెందిన శిరీష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశాడు. మూడు, నాలుగు రోజుల నుంచి వస్తున్న పెళ్లి వార్తలకు చెక్ పెడుతూ నోట్ రిలీజ్ చేశాడు. నైనికా అనే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నట్లు తెలుపుతూ ఓ ఫొటో షేర్ చేశాడు. ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవద్ వద్ద తన ప్రేయసి నైనికా చేతిని పట్టుకుని కనిపించాడు.

కానీ ఆమె ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. ‘‘నేడు మా తాతయ్య అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా నా మనసుకు సంబంధించిన ఓ విషయాన్ని మీతో పంచుకోవాలనుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నైనికాతో అక్టోబర్ 31న నిశ్చితార్థం చేసుకోబోతున్నాను. కొన్నాళ్ల క్రితమే చనిపోయిన మా నానమ్మ నేను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ కోరుకునేది. ఇప్పుడు ఆమె మా మధ్య లేనప్పటికీ పైనుంచి ఆశీర్వాదాలు కచ్చితంగా ఇస్తారని అనుకుంటున్నాను.

మా కుటుంబాలు.. మా ప్రేమను ఆనందంగా ఆమోదించాయి’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అది చూసిన నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు, అభిమానులు అల్లు శిరిష్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా.. నైనికా హైదరాబాద్‌కి చెందినట్లు తెలుస్తోంది. అల్లు ఇంటికి కాబోయే కోడలుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే ఆమె ఫేస్ ఎప్పుడెప్పుడు రివీల్ అవుతుందా? అని అంతా ఎదురుచూస్తున్నారు.

Next Story