- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ కష్టం తప్పదా అంటూ పెళ్లైన నెలకే అల్లు శిరిష్ షాకింగ్ పోస్ట్.. నెటిజన్ల సలహా ఏంటంటే?
యితే, పెళ్లి జరిగిన కొద్ది రోజులకే ఈ జంట హనీమూన్‌కు వెళ్లకుండా తమ వృత్తిపరమైన పనుల్లో బిజీ అయిపోయారు.

దిశ, సినిమా: అల్లు శిరీష్, నయనికల వివాహం మార్చి 6న అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు అల్లు, కొణిదెల కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ ప్రముఖులు, సన్నిహితులు భారీగా హాజరయ్యారు. పెళ్లి తర్వాత ఈ కొత్త జంటను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కలిసి ఆశీర్వదించడం విశేషం. అయితే, పెళ్లి జరిగిన కొద్ది రోజులకే ఈ జంట హనీమూన్‌కు వెళ్లకుండా తమ వృత్తిపరమైన పనుల్లో బిజీ అయిపోయారు. తాజాగా అల్లు శిరీష్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. తన భార్య నయనిక తల పట్టుకుని కూర్చున్న ఒక ఫొటోను షేర్ చేస్తూ.. "మళ్ళీ ఎక్సెల్ షీట్స్, జూమ్ మీటింగ్స్ , రియల్ ఎస్టేట్ పనుల్లోకి వచ్చేశాం" అని క్యాప్షన్ ఇచ్చారు.
దీన్ని బట్టి పెళ్లి సందడి ముగియగానే నయనిక తన బిజినెస్ పనుల్లో నిమగ్నమైపోయిందని అర్థమవుతోంది. ఈ కష్టం తప్పదా? అంటూ అల్లు శిరీష్ ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. సాధారణంగా పెళ్లైన కొత్తలో జంటలు విదేశీ పర్యటనలకు, హనీమూన్స్‌కు వెళ్తుంటారు. కానీ శిరీష్ భార్య మాత్రం పెళ్లైన వెంటనే ఆఫీస్ పనులతో కుస్తీ పడుతుండటం చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "కొన్నాళ్లు ఆ ప్రొఫెషనల్ లైఫ్‌కి బ్రేక్ ఇవ్వండి.. పర్సనల్ లైఫ్‌ని ఎంజాయ్ చేయండి" అంటూ శిరీష్ దంపతులకు సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరికొందరు మాత్రం ఈ జంట డెడికేషన్‌ను చూసి మురిసిపోతున్నారు. శిరీష్ కూడా త్వరలోనే తన తదుపరి సినిమా అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.






