లావణ్య త్రిపాఠి గురించి వైరల్ కామెంట్స్ చేసిన అల్లు శిరీష్..

by Disha Web Desk 6 |
లావణ్య త్రిపాఠి గురించి వైరల్ కామెంట్స్ చేసిన అల్లు శిరీష్..
X

దిశ, సినిమా: అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’. 2019లో ఫ్యామిలీ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలందరూ మంచి విజయాలను సొంతం చేసుకుంటుంటే శిరీష్ మాత్రం ఇంకా సక్సెస్‌ని రుచి చూడలేదు. ఇకపోతే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సోషల్ మీడియాలో అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో శిరీష్ .. లావణ్యను పొగడ్తలతో ముంచెత్తాడు. ‘లావణ్య మంచి హౌస్ వైఫ్. చాలా బాగా వంట చేస్తుంది. అందరిని బాగా చూసుకుంటుంది. పిల్లలు, పెద్దల విషయంలో చాలా ఓపికగా, సహనంగా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

Next Story

Most Viewed