‘దసరా’పై అల్లు అర్జున్ ప్రశంసలు.. ట్వీట్ వైరల్

by Dishanational2 |
‘దసరా’పై అల్లు అర్జున్ ప్రశంసలు.. ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించని తాజా చిత్రం ‘దసరా’. స్నేహం, ప్రేమ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తుంది. ఇక చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఆ లిస్ట్‌లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరారు. సినిమాను ప్రశంసిస్తూ అల్లు అర్జున్ చేసిన ట్వీట్ వైర‌ల్‌గా మారింది. ‘సంతోష్ నారాయ‌ణ‌న్‌, బీజీఎమ్‌, స‌త్యన్ కెమెరా వ‌ర్క్ చాలా బాగుంది. సినిమాకు ప్రాణం పోశాయ‌ని చెప్పాలి. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తొలి సినిమాతోనే అద్భుతం చేశాడు. ద‌ర్శకుడిగా త‌న ప్రతిభను చాటుకున్నాడు. నాని తన అద్భుతమైన నటనతో వేస‌విలోనే అస‌లైన ద‌స‌రా సంబ‌రాల్ని ఈ సినిమాతో తీసుకొచ్చాడు. నిర్మాతలు & సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు’ అని బన్ని రాసుకొచ్చాడు.

Read More:

ఇండియన్ 2’లోకి మరో యంగ్ హీరో.. ఆకట్టుకుంటున్న నయా పోస్టర్

Advertisement
Next Story

Most Viewed