‘ఇండియన్ 2’లోకి మరో యంగ్ హీరో.. ఆకట్టుకుంటున్న నయా పోస్టర్

by Hamsa |
‘ఇండియన్ 2’లోకి మరో యంగ్ హీరో.. ఆకట్టుకుంటున్న నయా పోస్టర్
X

దిశ, సినిమా: అప్ కమింగ్ పాన్ ఇండియా చిత్రాల్లో ‘ఇండియన్ 2’ ఒకటి. ఇరవై ఏడేళ్ల క్రితం శంకర్‌ డైరెక్షన్‌‌లో కమల్‌ హాసన్ నటించిన ‘భారతీయుడు’ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర నెలకొల్పిన రికార్డులు అంతా ఇంతా కాదు. అప్పట్లో రూ.50 కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేసిన తొలి సినిమాగా సంచలన రికార్డు క్రియేట్‌ చేసింది. కాగా ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ ‘ఇండియన్ 2’ తెరకెక్కుతుంది. ఎన్నో అంతరాయాల తర్వాత గతేడాది సెప్టెంబర్‌లో ఈ సినిమా షూటింగ్‌ పున: ప్రారంభమైంది. అప్పటి నుంచి షూటింగ్‌ యథావిధిగా జరుగుతుంది. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వెలువడింది. టాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. సోమవారం సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్.

Read More:

‘దసరా’పై అల్లు అర్జున్ ప్రశంసలు.. ట్వీట్ వైరల్


Next Story