త్వరలో పార్లమెంటు ఎదుటకు డిజిటల్ ఇండియా బిల్లు

by Shamantha N |
త్వరలో పార్లమెంటు ఎదుటకు డిజిటల్ ఇండియా బిల్లు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో డీప్ ఫేక్ కంటెంట్ వైరల్ అవుతోంది. తప్పుడు సమాచార వ్యాప్తికి కారణమవుతున్న ఇలాంటి కంటెంట్‌‌కు చెక్ పెట్టేందుకు ‘డిజిటల్ ఇండియా బిల్లు’ను తీసుకొచ్చేందుకు కేంద్ర సర్కారు యోచిస్తోంది. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ సాంకేతికత దుర్వినియోగం కాకుండా అడ్డుకునేలా.. దాన్ని సద్వినియోగాన్ని ప్రోత్సహించేలా నిబంధనలతో ఈ బిల్లు ఉంటుందని అంటున్నారు. ఈబిల్లుపై అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. యూట్యూబ్ సహా వివిధ ఆన్ లైన్, సోషల్ మీడియా మాధ్యమాలలో డీప్ ఫేక్ కంటెంట్‌ నియంత్రణకు కూడా ఈ బిల్లు ఉపయోగపడనుంది. పార్లమెంటు సమావేశాలు జూన్ 24న ప్రారంభమై జూలై 3న ముగుస్తాయి. వర్షాకాల పార్లమెంటు సమావేశాలు జూలై 22న ప్రారంభమై ఆగస్టు 9 వరకు కొనసాగనున్నాయి.Next Story

Most Viewed