ఇదే నా చివరి టీ20 వరల్డ్ కప్- బౌల్ట్

by Shamantha N |
ఇదే నా చివరి టీ20 వరల్డ్ కప్- బౌల్ట్
X

దిశ, స్పోర్ట్స్ : న్యూజిలాండ్ సీనియర్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ తనకు చివరిదని ప్రకటించాడు. టీ20 వరల్డ్ కప్‌లో కివీస్ గ్రూపు దశలోనే ఇంటిదారిపట్టింది. శనివారం ఆఖరి గ్రూపు మ్యాచ్‌లో ఉగాండాతో నెగ్గి విజయంతో వరల్డ్ కప్‌ను ముగించింది. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బౌల్ట్ మాట్లాడుతూ.. తాను ఆడబోయే చివరి టీ20 వరల్డ్ కప్ ఇదేనని తెలిపాడు. అలాగే, న్యూజిలాండ్ గ్రూపు దశలోనే నిష్ర్కమించడంపై స్పందిస్తూ.. ‘టోర్నీలో మాకు ఆశించిన ప్రారంభం దక్కలేదు. రెండు వారాలు గొప్పగా ఆడలేకపోయాం. అందుకే, సూపర్ 8కు అర్హత సాధించలేదు. కానీ, దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది.’ అని చెప్పుకొచ్చాడు. కాగా, 34 ఏళ్ల బౌల్ట్ 2022లో సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్నాడు. బౌల్ట్ తాజా ప్రకటనలో అతను అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగడంపై అనుమానాలు నెలకొన్నాయి. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్‌లో బౌల్ట్ ఆకట్టుకున్నాడు. 3 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు పడగొట్టి కివీస్ తరపున టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.Next Story

Most Viewed