భవిష్యత్ తరాల కోసం మెరుగైన ప్రపంచం : మోడీ

by Hajipasha |
భవిష్యత్ తరాల కోసం మెరుగైన ప్రపంచం : మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో : యావత్ ప్రపంచానికి, సకల మానవాళికి ప్రయోజనం చేకూర్చే అంశాలపై ఇటలీలో జరిగిన జీ7 సదస్సులో చర్చించామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెల్లడించారు. మానవ సమాజానికి ప్రయోజనం చేకూర్చే, సమస్యలను పరిష్కరించే ప్రభావవంతమైన పరిష్కార మార్గాలను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. భవిష్యత్ తరాల కోసం మెరుగైన ప్రపంచాన్ని సృష్టించడమే తమ ప్రధాన సంకల్పమన్నారు. ఇటలీలో జీ7 సదస్సు ముగియడంతో ప్రధాని మోడీ శనివారం ఉదయాన్నే భారత్‌కు చేరుకున్నారు. తన తొలి విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసిన సందర్భంగా ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు.

ఇటలీ ప్రజలు, ప్రభుత్వం అందించిన సాదర ఆతిథ్యానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు జీ7 సదస్సు ముగిసిన సందర్బంగా ఇటలీలో మీడియాతో మాట్లాడుతూ.. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు. కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య వ్యవహారాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘కొన్ని సున్నితమైన అంశాలపై మేము, భారత్ కలిసి పనిచేయాల్సి ఉంది. చాాలా ముఖ్యమైన ఆ టాపిక్స్‌పై భారత్‌తో కలిసి పనిచేసేందుకు మేం రెడీ. అది సున్నితమైన సమాచారం కావడంతో నేను బయటికి చెప్పలేను. అలాంటి సున్నిత అంశాల వల్ల భారత్‌తో ఏర్పడిన దూరాన్ని తగ్గించుకునేందుకు, సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనేందుకు మేం శాయశక్తులా ప్రయత్నాలు చేస్తాం’’ అని ట్రూడో వ్యాఖ్యానించారు.Next Story

Most Viewed