అల్లు అర్జున్ స్టైలిష్ పిక్.. విశేషమేంటో తెలుసా?

by Disha Web Desk 7 |
అల్లు అర్జున్ స్టైలిష్ పిక్.. విశేషమేంటో తెలుసా?
X

దిశ, సినిమా: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ 'పుష్ప' సినిమా తర్వాత రెండింతలైంది. మరోవైపు సోషల్ మీడియాలో బన్నీ పాపులారిటీ రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతానికి వరుస యాడ్ షూటింగ్స్‌తో బిజీగా గడుపుతున్న అర్జున్.. 'పుష్ప 2' షూటింగ్ మొదలుపెట్టే సమయానికల్లా ప్రముఖ కంపెనీల యాడ్స్ అన్నీ పూర్తిచేయనున్నట్లు తెలుస్తోంది. ఇక రీసెంట్‌గా తన ట్విట్టర్‌ అకౌంట్‌‌ 70 లక్షల ఫాలోవర్స్‌కు రీచ్ అయిన సందర్భంగా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌లో కనిపిస్తున్న స్టైలిష్ పిక్ షేర్ చేశాడు బన్నీ. ఈ పిక్ చూసిన నెటిజన్లు స్టన్నింగ్ లుక్ అంటూ కామెంట్ చేస్తున్నారు.


Next Story